ఫ్రీజర్‌లో మనం ఎక్కువగా నిల్వ చేసేవి పాల ఉత్పత్తులే. పాలు ఫ్రీజర్‌లో ఉంచితే, బయటకు తీసేటప్పుడు గడ్డకట్టే అవకాశం ఉంది. ఇది పాలను పాడు చేస్తుంది.
వేయించిన ఆహార పదార్థాలను ఫ్రీజర్‌లో నిల్వ చేస్తే వాటి రుచి పోతుంది. ఎక్కువసేపు నిల్వ చేయకుండా వేయించిన వెంటనే తినాలి.
ఉడికించిన, ఉడికించని నూడుల్స్ ఫ్రీజర్‌లో నిల్వ చేయకూడదు. ఎందుకంటే ఫ్రీజర్ నుండి బయటకు తీసినప్పుడు నూడుల్స్ గట్టిదనం కోల్పోయి మెత్తగా మారతాయి.
దోసకాయను ఫ్రీజర్‌లో నిల్వ చేసిన తర్వాత బయటకు తీసినప్పుడు వాటిలో తేమ ఉంటుంది, దాని వల్ల రుచిలో తేడా వస్తుంది.
డ్రై ఫ్రూట్స్ మాత్రమే ఫ్రీజర్‌లో నిల్వ చేయవచ్చు. తాజా పండ్లు నిల్వ చేస్తే అవి త్వరగా పాడైపోతాయి, రుచిలో తేడా వస్తుంది, పోషకాలు నష్టపోతాయి
సాస్‌ను ఫ్రీజర్ నుండి బయటకు తీసినప్పుడు టమాటా పేస్ట్ ఒక చోట, నీరు ఒక చోట వేరుగా ఉండటం చూడవచ్చు.
పాడవుతుందని అనుకుని అన్నాన్ని ఎప్పుడూ ఫ్రీజర్‌లో నిల్వ చేయకూడదు. ఇది అన్నం రుచి, ఆకారంలో మార్పులు తెస్తుంది.