Gas Safety: గ్యాస్ స్టవ్ దగ్గర ఇవి అస్సలు పెట్టొద్దు.. జాగ్రత్త సుమా!
life Jun 29 2026
Author: Nandini Arava Image Credits:Pixabay
Telugu
సిలిండర్‌ను వంచి ఉంచొద్దు
వంటగదిలో గాలి, వెలుతురు బాగా తగిలే చోట సిలిండర్‌ను పెట్టాలి. అంతేకాదు, సిలిండర్‌ను ఎప్పుడూ పక్కకు వంచి పెట్టకూడదు. ఇలా చేయడం వల్ల గ్యాస్ లీక్ అయ్యే ప్రమాదం ఉంది.
Image credits: istock
Telugu
హోస్‌ను చెక్ చేయడం మర్చిపోవద్దు
సిలిండర్‌కు కనెక్ట్ చేసే రబ్బర్ హోస్ నుంచే గ్యాస్ లీక్ అయ్యే అవకాశాలు ఎక్కువ. వాడకంలో రబ్బర్ హోస్‌పై పగుళ్లు ఏర్పడి గ్యాస్ లీక్ అవుతుంది. అందుకే హోస్‌ను తరచూ చెక్ చేస్తూ ఉండాలి.
Image credits: istock
Telugu
రెగ్యులేటర్ ఆఫ్ చేయండి
కేవలం స్టవ్ నాబ్ ఆఫ్ చేస్తే సరిపోదు. వంట పూర్తయ్యాక రెగ్యులేటర్‌ను కూడా ఆఫ్ చేయడం మర్చిపోవద్దు. ఇది ప్రమాదాల ముప్పును బాగా తగ్గిస్తుంది.
Image credits: Flipkart Website
Telugu
కిటికీలు తెరిచి ఉంచండి
వంటగదిలో గ్యాస్ వాసన వస్తుంటే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు. వెంటనే రెగ్యులేటర్ ఆఫ్ చేయాలి. ఆ తర్వాత తలుపులు, కిటికీలు తెరిచి గాలి బయటకు వెళ్లేలా చూడాలి.
Image credits: Getty
Telugu
వీటిని స్టవ్ దగ్గర పెట్టొద్దు
ప్లాస్టిక్ కవర్లు, టిష్యూ పేపర్లు, నూనె మరకలు పడిన బట్టలను గ్యాస్ స్టవ్ దగ్గర ఉంచొద్దు. ఇవి సులభంగా మంటలు అంటుకునే ప్రమాదాన్ని పెంచుతాయి.