Jaggery Storage: బెల్లం బూజు పడుతోందా? ఇలా చేస్తే ఏడాదైనా పాడవ్వదు
food-life Jun 29 2026
Author: Nandini Arava Image Credits:Getty
Telugu
బెల్లం ప్రయోజనాలు
షుగర్ పేషెంట్లు చక్కెరకు బదులు బెల్లం వాడతారు. కాబట్టి చాలా ఇళ్లల్లో బెల్లం నిల్వ ఉంటుంది. కూరల్లో రుచి బ్యాలెన్స్ చేయడానికి వాడతారు. పులుసు, పప్పుచారులో బెల్లం వేస్తే ఆ రుచే వేరు.
Image credits: Getty
Telugu
బెల్లం కరిగి నీరైపోతోందా?
కొన్నిసార్లు గాలి చొరబడని డబ్బాలో పెట్టినా సరే గాలి, తేమ తగిలి బెల్లం జిగురుగా మారుతుంది. కరిగిపోతుంది. దానిపై బూజు కూడా పడుతుంది. దీంతో బెల్లం పాడైపోతుంది.
Image credits: Getty
Telugu
సులభమైన కిచెన్ టిప్స్ ట్రై చేయండి
కొన్ని సింపుల్ కిచెన్ టిప్స్ పాటిస్తే చాలు. బెల్లాన్ని ఏడాది పొడవునా పాడవకుండా కాపాడుకోవచ్చు. సంవత్సరం మొత్తం తాజాగా, పొడిగా ఎలా ఉంచుకోవాలో ఇప్పుడు చూద్దాం.
Image credits: Getty
Telugu
గాజు సీసాలో పెట్టండి
బెల్లాన్ని ఎప్పుడూ ప్లాస్టిక్ డబ్బాలో పెట్టకూడదు. దానికి బదులుగా శుభ్రమైన గాజు సీసాలో లేదా మట్టి పాత్రలో నిల్వ చేయండి. ఇలా చేస్తే బెల్లానికి తేమ చేరదు.
Image credits: Getty
Telugu
అంతకంటే ముందు ఇది చేయండి
బెల్లాన్ని డబ్బాలో పెట్టే ముందు, శుభ్రంగా ఆరిన తెల్లటి కాటన్ క్లాత్‌లో చుట్టి పెట్టండి. ఈ క్లాత్ తేమను పీల్చుకుని, బెల్లం కరగకుండా కాపాడుతుంది.
Image credits: Getty
Telugu
బిర్యానీ ఆకును వాడండి
బెల్లం డబ్బాలో 2-3 బిర్యానీ ఆకులు (బే లీవ్స్) వేయండి. ఈ ఆకులు సహజంగా తేమను పీల్చుకుంటాయి. అంతేకాదు, ఆ ఆకుల వాసనకు చీమలు కూడా దగ్గరికి రావు.
Image credits: freepik
Telugu
బూజు పట్టకుండా రక్షించే టిప్
బెల్లానికి బూజు పట్టకుండా ఉండాలంటే, ఆ డబ్బాలో 1-2 పసుపు కొమ్ములు వేయండి. ఇది బెల్లాన్ని చాలా కాలం పాటు పాడవకుండా సురక్షితంగా ఉంచుతుంది.
Image credits: freepik
Telugu
బెల్లం జిగురుగా మారితే ఏం చేయాలి?
ఒకవేళ బెల్లం నీరుగా, జిగురుగా మారుతోందని మీకు అనిపిస్తే, వెంటనే దాన్ని డబ్బాలోంచి తీసి ఎండలో పెట్టండి. ఇలా చేయడం వల్ల బెల్లం మళ్లీ గట్టిపడుతుంది.