తలలో చుండ్రు సమస్య వేధిస్తోందా? అయితే.. ఖరీదైన షాంపూల అవసరం లేకపోయినా ఇంట్లో ఈజీగా లభించే కొన్ని ఉత్పత్తులు రాస్తే చుండ్రుకు చెక్ పెట్టొచ్చు.
Image credits: Social media
Telugu
టీ ట్రీ ఆయిల్
కొన్ని చుక్కల టీ ట్రీ ఆయిల్‌ను, అంతే పరిమాణంలో కొబ్బరి నూనెతో కలపాలి. ఈ మిశ్రమంలో దూదిని ముంచి, తలకు పట్టించాలి. వారానికి మూడు లేదా నాలుగు సార్లు ఇలా చేస్తే చుండ్రు తగ్గుతుంది.
Image credits: Getty
Telugu
కొబ్బరి నూనె
కొబ్బరి నూనెను తలకు బాగా పట్టించి మసాజ్ చేయాలి. గంట తర్వాత, గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేయాలి. వారానికి కనీసం రెండుసార్లు ఇలా చేయాలి.
Image credits: Getty
Telugu
ఉల్లిపాయ రసం
ఉల్లిపాయ రసం తీసి తలకు బాగా పట్టించాలి. గంటసేపు ఆరనిచ్చి, ఆ తర్వాత కడిగేయాలి. వారానికి రెండుసార్లు ఉల్లిపాయ రసాన్ని తలకు రాసుకోవాలి.
Image credits: Getty
Telugu
కలబంద గుజ్జు
కలబంద గుజ్జును తలకు బాగా పట్టించి మసాజ్ చేయాలి. 20 నిమిషాల తర్వాత కడిగేయాలి. వారానికి కనీసం రెండుసార్లు దీన్ని తలకు అప్లై చేయవచ్చు.
Image credits: Getty
Telugu
వేపాకులు
వేపాకులో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి. ఇవి చుండ్రును వదిలించడానికి సహాయపడతాయి. వేపాకులతో మరిగించిన నీటితో తలస్నానం చేయాలి.
Image credits: Instagram
Telugu
ఆముదం నూనె
చుండ్రును వదిలించుకోవడానికి వారానికి ఒకసారి ఆముదం నూనెను ఉపయోగించవచ్చు. ఇది యాంటీమైక్రోబయల్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. తల చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.