Lifestyle
కారణం లేకుండానే కొందరు విపరీతంగా బరువు పెరిగిపోతున్నాం అని బాధపడుతూ ఉంటారు.
అలా సడెన్ గా బరువు పెరగడానికి చాలా కారణాలు ఉంటాయట.
నిద్ర లేమి శరీర బరువు పెరగడానికి గల ప్రధాన కారణాలలో ఒకటి.
హార్మోన్ల హెచ్చుతగ్గులు కూడా శరీర బరువు పెరగడానికి దారితీస్తుంది.
ఆకస్మిక బరువు పెరుగుదల హైపోథైరాయిడిజం లక్షణాలలో ఒకటి. పొడి చర్మం, అలసట, మలబద్ధకం, జుట్టు రాలడం, కీళ్ల నొప్పులు వంటివి దీని లక్షణాలు.
కొన్ని మందుల వాడకం కూడా బరువు చాలా త్వరగా పెరగడానికి కారణం కావచ్చు.
ఒత్తిడి కార్టిసాల్ స్థాయిలను పెంచుతుంది. ఇది ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఇది కూడా బరువు పెరగడానికి దారితీస్తుంది.