కిచెన్‌లో ఒక రకమైన దుర్వాసన వస్తోందా? ఇలా చేస్తే అస్సలు రాదు
woman-life Aug 27 2024
Author: Shivaleela Rajamoni Image Credits:Freepik
Telugu
కిచెన్ శుభ్రత
వానాకాలంలో కిచెన్ సింక్, ఫ్రిజ్, అల్మారాల్లో తేమ ఎక్కువగా ఉంటుంది. వీటివల్ల దుర్వాసన ఎక్కువగా వస్తుంటుంది. కాబట్టి ఈ ప్లేసెస్ ను ప్రతిరోజూ శుభ్రం చేయండి,
Telugu
వినిగర్, బేకింగ్ సోడా
తేమ ఎక్కువగా ఉన్న దగ్గర వినిగర్, బేకింగ్ సోడా మిశ్రమాన్ని రుద్ది కొద్ది సేపటి తర్వాత బాగా కడగండి. ఇది మీ వంటగదిలో మంచి వాసన వచ్చే చేస్తుంది. అలాగే శుభ్రంగా కూడా ఉంచుతుంది.
Telugu
బేకింగ్ సోడా
బేకింగ్ సోడాను ఒక చిన్న గిన్నెలో నింపి వంటగదిలో ఒక మూలన పెట్టండి.ఇలా చేయడం వల్ల గాలిలోని తేమ, దుర్వాసన తొలగిపోతాయి.
Telugu
నిమ్మకాయ, ఉప్పు
అవును నిమ్మకాయ, ఉప్పుతో కూడా మీరు వంటగదిని శుభ్రం చేయొచ్చు. కమ్మని వాసన వచ్చేలా చేయొచ్చు. ఇందుకోసం నిమ్మరసంలో ఉప్పు కలిపి వంటగది ఉపరితలంపై రుద్దండి.
Telugu
గాలి ప్రసరణ
కిచెన్ రూం తలుపులు ఎప్పుడూ మూసి ఉంచకండి. తరచుగా కిటికీలు, ఫ్యాన్‌ని ఉపయోగించండి. ఇది తగినంత వెలుతురుతో పాటుగా తాజాదనాన్ని ఇస్తుంది.అప్పుడే కిచెన్ లో దుర్వాసన రాదు.
Telugu
పువ్వులు, సుగంధ తైలం
లావెండర్, పుదీనా, తులసి వంటి పువ్వులతో కూడా మీరు వంటింటి వాసనను పోగొట్టొచ్చు. సుగంధ తైలాలను నీటిలో కలిపి చల్లండి. ఇది దుర్వాసనను తొలగించి తాజాదనాన్ని ఇస్తుంది.