4321 .. ఈ రూల్ పాటిస్తే పడుకున్న వెంటనే నిద్రపడుతుంది
4321 స్లీపింగ్ రూల్ అంటే
ఈ రోజుల్లో చాలా మంది నిద్రలేమితో బాధపడుతున్నారు. ఇలాంటి వారికి 4321 రూల్ బాగా ఉపయోగపడుతుంది. ఈ రూల్ ని గనుక ఫాలో అయితే బెడ్ పై పడుకోగానే నిద్రపడుతుంది.
4 గంటల ముందు టీ-కాఫీ లు తాగొద్దు
నిద్రపోవడానికి 4 గంటల ముందు నుంచి మీరు టీ, కాఫీ వంటి కెఫిన్ ఉన్న డ్రింక్స్ ను అస్సలు తాగొద్దు. అప్పుడే మీకు రాత్రిపూట తొందరగా నిద్రపడుతుంది. ఈ కెఫిన్ మీకు నిద్రరాకుండా చేస్తుంది.
3 గంటల ముందే డిన్నర్
మీరు రాత్రిపూట బాగా నిద్రపోవాలంటే.. నిద్ర పోవడానికి ఇంకా 3 గంటలు ఉండగానే రాత్రి భోజనం చేసేయాలి. ఒకవేళ హెవీగా తినాలనుకుంటే సాయంత్రం 6 గంటల వరకే తినాలి. అప్పుడే మీకు నిద్రపడుతుంది.
2 గంటల ముందే నీళ్లు తాగాలి
నిద్రపోవడానికి రెండు గంటల ముందే మీరు నీళ్లను తాగాలి. ఆ తర్వాత తాగకూడదు. దీనివల్ల మీరు పడుకునే సమయానికి మూత్రం రాదు. మీ నిద్రకు డిస్టబెన్స్ కలగదు.
1 గంట ముందు ఫోన్ దూరం పెట్టాలి
నిద్రపోవాలంటే ఫోన్ అస్సలు చూడకూడదు. మీరు గనుక నిద్రపోవడానికి గంట ముందు నుంచే ఫోన్ కు దూరంగా ఉంటే.. మీకు తొందరగా నిద్రపడుతుంది. ఫోన్ నీలి కాంతి మీకు నిద్రపట్టకుండా చేస్తుంది.
4321 రూల్ ప్రయోజనాలు?
ఈ స్లీపింగ్ రూల్ మీకు బాగా నిద్రపట్టేలా చేయడంతో పాటుగా మీ జీర్ణవ్యవస్థకు విశ్రాంతినిస్తుంది. అలాగే తిన్నది బాగా జీర్ణం అవుతుంది. కడుపు తేలిగ్గా ఉంటుంది. దీంతో బాగా నిద్రపోతారు.