Career Guidance
ఇస్రో దేశ అంతరిక్ష కార్యక్రమాలు, ఉపగ్రహ ప్రయోగాలు, శాస్త్రీయ పరిశోధనలను నిర్వహిస్తుంది. ఇక్కడ పనిచేసే శాస్త్రవేత్తల జీతం ఎంతుంటుందో తెలుసా?
ఇస్రో శాస్త్రవేత్తల జీతం వారి పదవి, అనుభవం ఆధారంగా ఉంటుంది. ప్రారంభంలోనే శాస్త్రవేత్తలు లేదా ఇంజనీర్లకు నెల జీతం ₹72,362 వరకు వుంటుందట.
ఇస్రోలో ప్రధాన శాస్త్రవేత్తల జీతం నెలకు రూ.80,000 పైగా జీతం వుటుంది. అలాగే ఇతర అలవెన్సులు కూడా వుంటాయి.
టెక్నికల్ అసిస్టెంట్-B ₹21,700 నుండి ₹69,100 వరకు జీతం పొందుతారు. శాస్త్రవేత్త/ఇంజనీర్-SD కేటగిరీ వారు అయితే ₹67,700 నుండి ₹2,08,700 వరకు జీతం పొందుతారు.
ఇస్రో ఛైర్మన్ జీతం నెలకు ₹2.5 లక్షల వరకు వుంటుంది. ప్రత్యేక శాస్త్రవేత్త, అత్యుత్తమ శాస్త్రవేత్త వంటి పదవులు ఇస్రోలో అత్యంత గౌరవప్రదమైనవి.
ఇస్రో యువతకు అవకాశాలు కల్పిస్తుంది. ఇక్కడ ఇంజనీరింగ్ కొత్తవారు SC స్థాయి నుండి కెరీర్ ప్రారంభించి కాలక్రమేణా పదోన్నతులు పొంది సీనియర్ స్థాయికి చేరుకుంటారు.
ఇతర ప్రభుత్వ రంగ సంస్థలతో ఇస్రోలో మంచి సాలరీస్ వుంటాాయి. ఇక్కడి జీతం వృత్తిపరంగా, వ్యక్తిగతంగా అభివృద్ధి చెందడానికి ప్రోత్సాహకరంగా ఉంటుంది.
ఇస్రోకు బెంగళూరు ప్రధాన కార్యాలయం వుంది. ఇది యువ శాస్త్రవేత్తలు, ఇంజనీర్లకు ఉత్తమ కెరీర్ అవకాశం.
ఇస్రోలో పనిచేయడం కేవలం ఉద్యోగం మాత్రమే కాదు, దేశానికి సేవ చేయడం, అంతరిక్ష పరిశోధనలో పాల్గొనడం గర్వకారణం.