Career Guidance

నిద్రకే ఉద్యోగం

Image credits: Freepik

హాయిగా నిద్రపోతే చాలు: 10 లక్షల జీతం

నిద్రపోవడానికి కూడా జీతం ఇస్తారంటే అంతకంటే సుఖం ఇంకేముంటుంది? రోజుకు తొమ్మిది గంటలు నిద్రపోయి తొంభై వేల జీతం తీసుకోవడానికి ఎవరు నో చెబుతారు? 

వేక్‌ఫిట్‌లో ఉద్యోగం

నిద్ర ఉత్పత్తులను తయారు చేసే కంపెనీ వేక్‌ఫిట్ ఒక స్లీప్ ఇంటర్న్‌షిప్‌ను ప్రకటించింది. దీనిలో భాగంగా రెండు నెలల పాటు నిద్రించడానికి మీకు రూ.10 లక్షలు ఇవ్వనున్నారు.

ఎవరికి ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి?

వేక్‌ఫిట్ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ ఇంటర్న్‌షిప్ వివరాలను అందించారు. దీని కోసం అప్లై చేసుకోవడానికి https://bit.ly/4fW31N7 లింక్‌ను క్లిక్ చేయండి.

ఉద్యోగం ఎక్కడ?

ఈ ఉద్యోగంలో చేరితే మీరు చేయాల్సిందల్లా మంచం మీద పడుకుని నిద్రపోవడమేనని వేక్‌ఫిట్ తెలిపింది. అంటే మీ ఆఫీస్ మీ మంచమే. ఈ ఉద్యోగం రెండు నెలల పాటు మాత్రమే ఉంటుంది.

ఎన్ని గంటలు నిద్రపోవాలి?

'మీరు స్ప్రెడ్‌షీట్‌ల కంటే మంచాన్ని ఎక్కువగా ఇష్టపడితే, రోజువారీ పనిలో భాగంగా 9 గంటల పాటు నిద్రపోవాలి. ఇష్టపడేవారికి మా దగ్గర ఒక అవకాశం ఉంది' అని వేక్‌ఫిట్ తన ప్రకటనలో తెలిపింది.

జీతం ఎంత?

ఈ ఇంటర్న్‌షిప్‌కు ఎంపికైన ప్రతి ఒక్కరికీ నెలకు రూ. లక్ష ఖచ్చితమైన స్టైఫండ్ లభిస్తుంది. స్లీప్ ఛాంపియన్‌గా నిలిచే అభ్యర్థి రూ.10 లక్షలు పొందవచ్చు. 

అర్హత ఏమిటి?

ఏదైనా ఒక డిగ్రీ, దిండును సరిగ్గా ఉపయోగించుకోవడం, ఇబ్బంది లేకుండా నిద్రపోవడం ఈ ఉద్యోగానికి అర్హతలు. నిద్రకు సాకులు చెప్పడం వంటి అంశాలను ఇంటర్వ్యూలో అడుగుతారు. 

వీళ్ళు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు

మ్యాచ్‌లు, సినిమాలు చూస్తున్నప్పుడు, ట్రాఫిక్‌లో నిద్రపోయేవారు, వర్షం పడుతుంటే ప్లాన్ వేసుకుని నిద్రపోయేవారు కూడా ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ దేశాల్లో నిరుద్యోగులకూ బెస్ట్ బెనిఫిట్స్ : భారత్ ఎక్కడ?

కేవలం ఇంటర్ అర్హతతో ... లక్షలు సంపాదించే టాప్ 5 జాబ్స్ ఇవే..

మీ చదువుకోసం ఆర్థికసాయం కావాలా..? ఈ స్కాాలర్ షిప్స్ కు ట్రై చేయండి