Career Guidance
మీరు డిగ్రీ చేయకపోయినా ఎస్ఎస్సీ ద్వారా క్లర్క్, అసిస్టెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వంటి ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
డిగ్రీ లేకున్నా మీరు ఫైర్ డిపార్ట్మెంట్ లో జాబ్ చేయవచ్చు. అయితే.. మీరు పది పాసై ఉండి, అగ్నిమాపక శిక్షణ పూర్తి చేస్తే సరిపోతుంది.
అత్యవసర పరిస్థితుల్లో వైద్య సహాయం అందించడంలో ఇఎంటీలు, పారామెడిక్స్ కీలక పాత్ర పోషిస్తారు. పది తో పాటు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ శిక్షణ తప్పనిసరి.
రైల్వేలో గ్రూప్ సి, డి విభాగాల్లో ఉద్యోగాలకు పదో తరగతి లేదా ఇంటర్ పాసై ఉంటే సరిపోతుంది.
విమానాల రాకపోకలను క్రమబద్ధీకరించడంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ల పాత్ర కీలకం. ఈ ఉద్యోగానికి ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) అందించే ప్రత్యేక శిక్షణ తీసుకోవాలి.
గ్రంథాలయంలో పుస్తకాలు, ఇతర సామగ్రిని క్రమబద్ధీకరించడం, సభ్యులకు సహాయం చేయడం లైబ్రరీ టెక్నీషియన్ విధులు. పదో తరగతితో పాటు లైబ్రరీ సైన్స్‌లో కొంత శిక్షణ తీసుకుంటే సరిపోతుంది.
బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్ వంటి ఉద్యోగాలకు కూడా ఇంటర్ పాసైన వారు అప్లై చేసుకోవచ్చు. కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (CBP) అధికారిగా మారడానికి కూడా పది చదవి, ప్రత్యేక శిక్షణ అవసరం.
ప్రభుత్వ భవనాల్లో ఎలక్ట్రీషియన్, ప్లంబర్‌గా పనిచేయడానికి డిగ్రీ అవసరం లేదు. సాంకేతిక శిక్షణ, లైసెన్స్ ఉంటే సరిపోతుంది.
సైన్యం, నౌకాదళం, వైమానిక దళంలో కూడా పదో తరగతితో పాటు ప్రత్యేక శారీరక దారుఢ్యం ఉంటే సరిపోయే ఎన్నో ఉద్యోగాలున్నాయి.