భారతదేశంలోనే అతి చిన్న వయసు గల మహిళా ఐఎఎస్ అధికారిణి అనన్య సింగ్. ఆమె యూపిఎస్సిలో మంచి ర్యాంక్ సాధించారు. ఏదైనా సాధించాలనే లక్ష్యం, దృఢ సంకల్పం, కృషి ముఖ్యమని నిరూపించారు.
అనన్య సింగ్ ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జన్మించారు. ఆమె ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందినవారు. చిన్న వయసు నుండే ఆమె చదువులో ప్రతిభకు గుర్తింపు పొందారు.
అనన్య సింగ్ సెయింట్ మేరీస్ కాన్వెంట్ స్కూల్‌లో చదివారు. ఆమె తన తరగతిలో టాపర్. 10వ తరగతిలో 96%, 12వ తరగతిలో 98.25% మార్కులు సాధించి జిల్లా టాపర్ అయ్యారు.
అనన్య సింగ్ ఢిల్లీలోని ప్రతిష్టాత్మకమైన శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ నుండి ఎకనామిక్స్‌లో ఆనర్స్ డిగ్రీ పొందారు. కాలేజీలో ఉండగానే యూపిఎస్సికి ప్రిపేర్ అవ్వడం మొదలుపెట్టారు.
అనన్య గ్రాడ్యుయేషన్ చివరి సంవత్సరంలో యూపిఎస్సి ప్రిపరేషన్ మొదలుపెట్టారు. మొదట్లో 7-8 గంటలు చదివేవారు. తర్వాత ప్రిలిమ్స్, మెయిన్స్ రెండిటికీ రోజుకి 6 గంటలు చదివేవారు.
అనన్య సింగ్ కేవలం ఒక సంవత్సరం కష్టపడి యూపిఎస్సి పరీక్షను క్లియర్ చేసారు. మొదటి ప్రయత్నంలోనే 51వ ర్యాంక్ సాధించారు. అప్పుడు ఆమె వయసు కేవలం 22 సంవత్సరాలు.
అనన్య సింగ్ యూపిఎస్సి ఫలితాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. యూపిఎస్సి మెయిన్స్‌లో 825 మార్కులు, ఇంటర్వ్యూలో 187 మార్కులు, మొత్తం 1012 మార్కులు సాధించి ఐఎఎస్ అయ్యారు.
అనన్య సింగ్ ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌లో పనిచేస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు 45.5k ఫాలోవర్స్ ఉన్నారు. UPSC ప్రిపరేషన్ టిప్స్ తో లక్షల మంది విద్యార్థులకు స్ఫూర్తినిస్తున్నారు.
తన UPSC సక్సెస్ వెనుక నిరంతర కృషి, సరైన స్ట్రాటజీ, క్రమశిక్షణ ఉందని.. వీటితో ఏ కఠిన పరీక్షనైనా సులభంగా పాస్ కావచ్చని అనన్య సింగ్ చెబుతున్నారు.