మందులను వేడినీళ్లతో వేసుకుంటే త్వరగా కరిగిపోతాయి. దీనివల్ల ఇవి రక్త ప్రవాహంలో తొందరగా శోషించబడతాయి.
వేడినీళ్లను తాగడం వల్ల కండరాలు సడలించబడతాయి. మీరు మందులను వేడినీళ్లతో వేసుకుంటే ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుతాయి.
వేడినీళ్లను తాగడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.దీంతో మందులు శరీరంలోని ముఖ్యమైన భాగాలకు వెంటనే చేరుకుంటాయి.
వేడినీళ్లను తాగితే శరీరంలోని విష పదార్థాలు బయటకు వెళ్లే ప్రక్రియ వేగవంతం అవుతుంది. దీంతో అవయవాలు సక్రమంగా పనిచేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
అయితే మందులను ఎక్కువగా తీసుకుంటే కడుపులో మంట, వాపు వంటి సమస్యలు వస్తాయి. అయితే వేడి నీళ్లు ఈ సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది.
మీరు మందులను 200 మి.లీ. నీటితో వేసుకోవచ్చు. ఇంతకన్న తక్కువ తాగితే మందులు గొంతులో ఇరుక్కునే ప్రమాదం ఉంది.
అయితే కొంతమంది మందులను టీ, కాఫీ, పాలు, జ్యూస్ వంటి డ్రింక్స్ తో కూడా వేసుకుంటుంటారు. కానీ వీటితో మందులను వేసుకోకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఫ్యాటీ లివర్ : ముఖం చూస్తేనే తెలిసిపోతుందా?
రోజూ మర్చిపోకుండా కప్పు పెరుగు తిన్నారంటే మీకు ఈ సమస్యలే రావు
చాయ్ ఎక్కువ తాగితే ఈ సమస్యలు రావడం పక్కా
జెర్రి కుడితే వెంటనే ఏం చేయాలో తెలుసా?