జుట్టుకు నిమ్మరసం వాడితే స్కాల్ప్‌లో రక్తప్రసరణ బాగా జరిగి, జుట్టు బాగా పెరగడానికి సహాయపడుతుంది.
జుట్టును మృదువుగా చేయడంలో నిమ్మరసం సహాయపడుతుంది. ఇది జుట్టుకు సహజమైన మెరుపునిస్తుంది, ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది.
నిమ్మరసంలో ఉండే విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. జుట్టును బలంగా చేసి, విరగకుండా చేస్తుంది.
నిమ్మకాయలో ఉండే సిట్రిక్ యాసిడ్ సూర్యరశ్మి నుంచి జుట్టును రక్షిస్తుంది. జుట్టును సహజంగా ప్రకాశవంతం చేస్తుంది.
నిమ్మరసం తలలో ఉండే అధిక జిడ్డును తగ్గించి జుట్టును తాజాగా, శుభ్రంగా ఉంచుతుంది.
నిమ్మరసంలో ఉండే సిట్రిక్ యాసిడ్ స్కాల్ప్ pH స్థాయిని సమతుల్యం చేసి చుండ్రును తగ్గించడానికి సహాయపడుతుంది.
మీరు స్నానం చేయడానికి ఉపయోగించే నీటిలో నిమ్మరసం కలిపి స్కాల్ప్‌కు పట్టించాలి. 15 నిమిషాల తర్వాత తేలికపాటి షాంపూతో స్నానం చేయండి.
Sesame Seeds: వేసవిలో నువ్వులు తింటే ఏమవుతుందో తెలుసా?
Health tips: పీరియడ్స్ టైంలో కడుపు నొప్పి తగ్గాలంటే ఇవి తినండి!
ఈ లక్షణాలు ఉంటే మీ శరీరంలో ఐరన్ తక్కువగా ఉందని అర్థం
పాలు తాగితే బరువు పెరుగుతారా?