Health
పుచ్చకాయలో ముందే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ పండు తిన్న తర్వాత మీరు నీళ్లు తాగితే జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
అరటి పండ్లలో మనల్ని ఆరోగ్యంగా ఉంచే ఎన్నో లక్షణాలు ఉంటాయి. అయితే ఈ పండును తిన్న తర్వాత నీళ్లను తాగకూడదని నిపుణులు చెబుతున్నారు.
రోజుకో ఆపిల్ పండును తింటే ఎన్నో రోగాల ముప్పు తగ్గుతుంది. కానీ ఈ పండ్లను తిన్న తర్వాత నీళ్లను తాగితే జీర్ణక్రియపై ప్రతికూల ప్రభావం పడుతుంది.
దానిమ్మపండ్లను తిని వెంటనే నీళ్లను తాగితే ఎసిడిటీ, వాంతులు, వికారం వంటి సమస్యలు వస్తాయి.
సిట్రస్ పండ్లు తిన్న తర్వాత కూడా నీళ్లను తాగకూడదు. ఒకవేళ తాగితే శరీరంలో పిహెచ్ స్థాయి బాగా తగ్గి జీర్ణ సమస్యలు వస్తాయి.
నేరెండు పండ్లను తిన్న తర్వాత నీళ్లను తాగితే డయేరియా, అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి.