Health
ఈ రోజుల్లో చాలా మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య కిడ్నీలో రాళ్లు.
మూత్రం చేసేటప్పుడు నొప్పి, మూత్రం రంగు మారడం, తరచుగా మూత్రం చేయడం, కడుపులో నొప్పి వస్తుంటే కిడ్నీలో రాళ్లు ఉండొచ్చు.
తక్కువ నీరు తాగడం కిడ్నీలో రాళ్లు రావడానికి ముఖ్య కారణం.
ఎక్కువ బరువు ఉండటం కూడా ఒక కారణం. బరువు ఎక్కువ ఉన్న చాలా మందికి కిడ్నీలో రాళ్లు ఉంటున్నాయి.
హైపర్ పారా థైరాయిడిజం, UTI, జీర్ణ సమస్యలు కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి మరికొన్ని కారణాలు.
ఎక్కువ ప్రోటీన్ ఆహారం తింటే యూరిక్ యాసిడ్ స్థాయిని పెంచుతాయి. దీంతో కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి అవకాశం ఉంటుంది.
శరీరంలో సోడియం స్థాయి ఎక్కువైనా కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంటుంది.