Health
అధిక రక్తపోటుతో బాధపడేవారు సోడియం లేదా ఉప్పు మొత్తాన్ని చాలా వరకు తగ్గించండి. అప్పుడే బీపీ నియంత్రణలో ఉంటుంది.
ఆరోగ్యంగా ఉండేందుకు ఆహారం చాలా అవసరం. ముఖ్యంగా పండ్లను, కూరగాయలను పుష్కలంగా తింటే రక్తపోటు పెరిగే అవకాశమే ఉండదు.
పొటాషియం ఎక్కువగా ఉండే ఆహారాలు బీపీని కంట్రోల్ లో ఉంచుతాయి. ఇందుకోసం మీ రోజువారి ఆహారంలో అరటిపండ్లు, అవొకాడోలు, బచ్చలికూర, నారింజ వంటి ఆహారాలను చేర్చాలి.
బీపీ ఉన్నవారు నీళ్లను ఎక్కువగా తాగాలి. ఇది రక్త ప్రవాహాన్ని పెంచడానికి, రక్తపోటును నియంత్రించడానికి బాగా సహాయపడుతుంది.
రక్తపోటు నియంత్రణలో ఉండాలంటే మీ బరువు ఆరోగ్యకరమైందిగా ఉండాలి. అధిక బరువు ఉన్నవారు బరువును తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి.
రక్తపోటును నియంత్రించడానికి వ్యాయామం బాగా సహాయపడుతుంది. అందుకే వీళ్లు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.
యోగా, ధ్యానం చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుంది.
రాత్రిపూట బాగా నిద్రపోవడం వల్ల కూడా బీపీ నియంత్రణలో ఉంటుంది.