Health

వర్షాకాల వ్యాధులు

వర్షాకాలంలో ఎన్నో రకాల వ్యాధులు రావడం ప్రారంభమవుతుంది. అసలు వర్షాకాలంలో ఏయే వ్యాధులు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

Image credits: Getty

హెచ్1ఎన్1

హెచ్1ఎన్1 గాలి ద్వారా వ్యాపించే వైరల్ ఫీవర్. ఈ వ్యాధి జ్వరం, జలుబు, దగ్గు, గొంతునొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలను కలిగిస్తుంది. 

Image credits: Getty

డెంగ్యూ జ్వరం

డెంగ్యూ జ్వరం.. ఏడిస్ ఈజిప్టి, ఏడిస్ ఆల్బోపిక్టస్ అనే రెండు రకాల ఆడ దోమల ద్వారా వ్యాపిస్తుంది. ఈ వ్యాధి చాలా సార్లు ప్రాణాంతకంగా మారుతుంది.

Image credits: Getty

చికెన్ గున్యా

చికెన్ గున్యా వైరస్ దోమ కాటు ద్వారా మనకు సోకుతుంది. ఈ వ్యాధి సాధారణంగా వర్షాకాలంలోనే వస్తుంది.

Image credits: Getty

డెంగ్యూ జ్వరం

డెంగ్యూ జ్వరం.. ఏడిస్ ఈజిప్టి, ఏడిస్ ఆల్బోపిక్టస్ అనే రెండు రకాల ఆడ దోమల ద్వారా వ్యాపిస్తుంది. ఈ వ్యాధి చాలా సార్లు ప్రాణాంతకంగా మారుతుంది.

 

Image credits: Getty

జపనీస్ ఎన్సెఫాలిటిస్

జపనీస్ ఎన్సెఫాలిటిస్ అనేది మెదడు పొరను ప్రభావితం చేసే వైరల్ వ్యాధి. ఇదొక  ప్రాణాంతక వ్యాధి. ఇది క్యూలెక్స్ దోమ ద్వారా వ్యాపిస్తుంది.
 

Image credits: Getty

ఎలుక జ్వరం

లెప్టోస్పైరా అనే బ్యాక్టీరియా వల్ల ఈ వ్యాధి వస్తుంది. ఎలుక మూత్రపిండాల్లో పెరిగే బ్యాక్టీరియా వాటి మూత్రం ద్వారా విసర్జించబడుతుంది.
 

Image credits: Getty

టైఫాయిడ్

టైఫాయిడ్ అనేది కలుషితమైన ఆహారం, నీటి ద్వారా సంక్రమించే వ్యాధి. వర్షాకాలంలో చాలా మంది ఈ వ్యాధి బారిన పడతారు. 
 

Image credits: Getty

కలరా

కలరా.. నీళ్ల ద్వారా సంక్రమించే వ్యాధుల్లో ఒకటి. ఈ వ్యాధి విబ్రియో కలరా అనే బ్యాక్టీరియా ద్వారా వ్యాపిస్తుంది.
 

Image credits: Getty

కామెర్లు

రక్తంలో బిలిరుబిన్ లెవెల్స్ ఎక్కువగా పెరగడం వల్ల కామెర్లు వస్తాయి. దీనివల్ల కళ్లు పసుపు రంగులోకి మారడం, వాంతులు, ఆకలి లేకపోవడం,  అలసట, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
 

Image credits: Getty

కడుపు నిండ తిన్నా మళ్లీ ఆకలి ఎందుకు అవుతుందో తెలుసా?

బ్యాక్ పెయిన్ ను తగ్గించే ఎఫెక్టీవ్ చిట్కాలివి

ఎముకలు బలంగా ఉండాలంటే చేయాల్సింది ఇదే..!

వీటిని తింటే దంతాలు దెబ్బతింటాయి జాగ్రత్త..