Telugu

Migraine: మైగ్రేన్‌‌తో బాధపడుతున్నారా.. ఈ ఫుడ్ ను దూరం పెట్టాల్సిందే !

Telugu

పులియబెట్టిన ఆహారాలు

పులియబెట్టిన ఆహారంలో (Fermented foods)  టైరమైన్ అధికంగా ఉంటుంది. ఇది కొంతమందిలో మైగ్రేన్ కి కారణం కావచ్చు.

Image credits: Getty
Telugu

ప్రాసెస్డ్ ఫుడ్, ఎండబెట్టిన మాంసం

బేకన్, హాట్ డాగ్స్ వంటి ప్రాసెస్ చేసిన లేదా ఎండబెట్టిన మాంసంలో నైట్రేట్లు, నైట్రైట్లు వంటి రసాయనాలు ఉంటాయి. ఇవి కొంతమందిలో మైగ్రేన్ తలనొప్పిని ప్రేరేపించవచ్చు.

Image credits: Getty
Telugu

మద్యం

మద్యం, ముఖ్యంగా రెడ్ వైన్‌లో ఉండే టానిన్లు, హిస్టామిన్లు కొంతమందిలో మైగ్రేన్  తలనొప్పిని ప్రేరేపిస్తాయి.

Image credits: Getty
Telugu

కాఫీ

కాఫీలో ఉన్న కేఫిన్‌ను అధికంగా తీసుకోవడం వల్ల కొంతమందికి మైగ్రేన్ రావచ్చు. అంతేకాక, కాఫీని సడెన్ గా మానేసిన కూడా మైగ్రేన్‌ వచ్చే అవకాశం ఉంటుంది.

Image credits: Getty
Telugu

చాక్లెట్

మైగ్రేన్ ఉన్నవారు చాక్లెట్స్ ఎక్కువగా తినకూడదు. వీటిలోని కేఫిన్, థియోబ్రొమిన్ వంటి పదార్థాలు తలనొప్పిని ప్రేరేపిస్తాయి. 

Image credits: Getty
Telugu

సిట్రస్ పండ్లు

మైగ్రేన్ ఉన్నవారు  లెమన్, ఆరెంజ్, ముసంబి వంటి సిట్రస్ పండ్లు లేదా  చల్లని పదార్థాలకు దూరంగా ఉండటమే మేలు. వీటిలోని ఆమ్లాలు నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తాయి. 

Image credits: Getty
Telugu

కృత్రిమ స్వీటెనర్

కృత్రిమ తీపి పదార్థాలలో ఉండే అస్పార్టేమ్ రసాయనం మైగ్రేన్‌ను ప్రేరేపిస్తుంది. ఇవి మెదడులోని నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది.

Image credits: Getty

కొలెస్ట్రాల్ ను తగ్గించే పవర్‌ఫుల్ డ్రింక్స్.. ఉదయాన్నే తాగితే..

Hair Care: జుట్టు ఒత్తుగా పెరగాలంటే రోజూ వీటిని తింటే చాలు!

Fatty Liver: స్త్రీలలో ఈ లక్షణాలు కనిపిస్తే ఫ్యాటీ లివర్ ఉన్నట్టే..

Food Digestion Time: ఏ ఆహారం ఎంత సమయానికి జీర్ణం అవుతుందో తెలుసా ?