ఫ్యాటీ లివర్ లక్షణాల్లో కడుపు నొప్పి ప్రధాన సమస్య. అలాగే ఉబ్బరం, అసౌకర్యం, ఆకలిలో మార్పులు కనిపిస్తాయి. ఇవి లివర్‌పై కొవ్వు పేరుకుపోవడం వల్ల కలుగుతాయి.
ఫ్యాటీ లివర్ ఉన్నవారిలో ఎక్కువగా అలసట, నీరసం వంటి లక్షణాలు కనిపిస్తాయి. లివర్ పనితీరు తగ్గిపోవడం వల్ల శరీరంలో శక్తి ఉత్పత్తి తగ్గుతుంది.
ఫ్యాటీ లివర్ వల్ల కడుపులో నీరు చేరడం (అసైటిస్), బరువుగా అనిపించడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఇది లివర్‌కు సంబంధిత వ్యాధి తీవ్రమవుతుండటాన్ని సూచిస్తుంది.
ఫ్యాటీ లివర్ తీవ్రమైతే, కాళ్లు, చేతులు, ముఖంలో వాపు రావచ్చు. ఇది శరీరంలో ద్రవం నిల్వ ఉండటాన్ని సూచిస్తుంది, దీన్ని “ఎడిమా” అంటారు.
చర్మం దురద కూడా ఫ్యాటీ లివర్ లక్షణం కావచ్చు. లివర్ సరిగా పని చేయకపోతే శరీరంలో టాక్సిన్లు పేరుకుపోయి, చర్మంపై ప్రభావం చూపవచ్చు.
మూత్రం రంగు మారడం కూడా లివర్ సమస్యలకు సంకేతం కావచ్చు. ముఖ్యంగా గోధుమ లేదా ముదురు పసుపు రంగులో మూత్రం బయటపడితే, అది లివర్ ఫంక్షన్ బాగా లేకపోవడం వల్ల బిలిరూబిన్ పెరగడం లక్షణం కావచ్చు
అకస్మాత్తుగా బరువు తగ్గడం కూడా ఫ్యాటీ లివర్ లక్షణంగా పరిగణించవచ్చు. ఇది లివర్ ఆరోగ్యంపై ప్రభావం చూపించే మెటబాలిక్ మార్పుల వల్ల జరుగుతుంది.
ఈ లక్షణాలుంటే వెంటనే వైద్యులను 'సంప్రదించండి'.