Health
ఒత్తిడితో బాధపడేవారు డీహైడ్రేషన్‌కు గురవుతారు. ఈ కారణంగానే నోటి దుర్వాసన వెంటాడే అవకాశాలు ఉంటాయి.
చెమట రావడం సర్వసాధారణం. అయితే ఒత్తిడితో బాధపడే వారిలో శరీరం నుంచి వచ్చే చెమట దుర్వాసన ఎక్కువగా ఉంటుంది.
రోర్లు పెలుసుగా మారినా, పదే పదే విరిగిపోతున్నా అది కూడా ఒత్తిడికి ప్రాథమిక లక్షణంగా భావించాలని నిపుణులు అంటున్నారు.
చర్మంపై దురద రావడం, చర్మం డ్రైగా మారుతోన్నా అది ఒత్తిడికి సంకేతం కావొచ్చు.
పదే పదే మల విసర్జనకు వెళ్లాల్సినట్లు భావన కలుగుతుండడం. తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం కూడా ఒత్తిడికి సంకేతంగా భావించాలి.
వేగంగా పొట్ట పెరిగితే అది ఒత్తిడి ప్రాథమిక లక్షణంగా భావించాలని నిపుణులు చెబుతున్నారు. మనిషి ఒత్తిడిలో తెలియకుండానే ఎక్కువగా తింటారు.
దీర్ఘకాలంగా ఒత్తిడితో బాధపడేవారిలో కనిపించే ప్రాథమిక లక్షణాల్లో వెంట్రుకలు రాలడం కూడా ఒకటని నిపుణులు చెబుతున్నారు.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారంగానే భావించాలి. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.