బీన్స్, క్యాబేజీ, బ్రోకోలి, కార్బొనేటెడ్ డ్రింక్స్ వంటి వాటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపుబ్బరం సమస్య వస్తుందని నిపుణులు చెబుతున్నారు.
అధికంగా ఉప్పు, మసాలాలు ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది.
ఆదరబాదరగా ఆహారం తినడం, సరిగ్గా నమలకుండానే మింగేయడం వల్ల కడుబుబ్బరం వేధిస్తుంటుంది.
తక్కువగా నీరు తాగే వారిలో ఆహారం సరిగ్గా జీర్ణమవ్వదు. ఇది కూడా కడుపుబ్బరానికి దారి తీస్తుంది.
అధికంగా మద్యం సేవించే వారిలో జీర్ణాశయ సంబంధిత సమస్యలు వస్తాయి. ఇది దీర్ఘకాలంలో కడుబ్బరానికి దారి తీస్తుంది.
నిత్యం ఒత్తిడితో చిత్తయ్యే వారిలో కూడా జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయని, కడుబ్బరానికి ఇది కూడా ఒక కారణమని నిపుణులు అంటున్నారు.
గంటల తరబడి ఒకేచోట కూర్చునే వారిలో, వ్యాయామం చేయని వారిలో కూడా కడుపుబ్బరం సమస్యకు దారి తీస్తుంది.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.
నానబెట్టిన కిస్ మిస్ లను తింటే మీ శరీరంలో ఈ తేడాను గమనిస్తారు
రోజూ గుప్పెడు సన్ ఫ్లవర్ గింజలు తింటే ఏమవుతుందో తెలుసా?
చిన్న పిల్లలకు గాడిద పాలు తాగిస్తే.. ఏమవుతుందో తెలుసా?
రాత్రి భోజనం తర్వాత ఇవి చేస్తే.. బరువు ఇట్టే తగ్గిపోవచ్చు!