Health
నిమ్మ, నారింజ, ద్రాక్ష వంటి సిట్రస్ పండ్లలో ఉండే సిట్రిక్ యాసిడ్ కొందరి దంతాల్లోని ఎనామిల్ ను నాశనం చేసి దంతాలు దెబ్బతినేలా చేస్తుంది.
పైనాపిల్ లో సిట్రిక్ యాసిడ్, షుగర్ లు ఉంటాయి. వీటిని ఎక్కువగా తినడం వల్ల దంతాల ఎనామిల్ దెబ్బతింటుంది.
మామిడి పండ్లను మోతాదులోనే తినాలి. వీటిని ఎక్కువగా తినడం వల్ల దంతాల ఆరోగ్యం దెబ్బతింటుంది.
స్వీట్లు ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. వీటిని ఎక్కువగా తింటే కూడా మీ దంతాలు దెబ్బతింటాయి.
సోడా వంటి శీతల పానీయాలను ఎక్కువగా తాగినా కూడా దంతాలు దెబ్బతింటాయి.
వైన్ లో ఉండే ఆమ్లం దంతాలలోని ఎనామిల్ పై చెడు ప్రభావాన్నిచూపుతుంది. ఇది దంతాల రంగును పసుపు పచ్చగా మారుస్తుంది.
అతిగా మందు తాగడం వల్ల ఆరోగ్యం దెబ్బతినడంతో పాటుగా దంతాలు కూడా దెబ్బతింటాయి.