ఈ సింపుల్ టిప్స్ తో పళ్లు తెల్లగా మెరిసిపోవడం పక్కా!
health-life Apr 13 2026
Author: Kavitha G Image Credits:Getty
Telugu
నిమ్మరసం, ఉప్పు
కొద్దిగా నిమ్మరసంలో చిటికెడు ఉప్పు కలపాలి. ఈ మిశ్రమంతో పళ్లపై రెండు, మూడు నిమిషాల పాటు రుద్దాలి. ఆ తర్వాత నీటితో నోటిని శుభ్రంగా కడుక్కోవాలి.
Image credits: pinterest
Telugu
ఆయిల్ పుల్లింగ్
కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనెను 10-15 నిమిషాల పాటు నోటిలో వేసుకుని పుక్కిలించాలి. ఇది నోటిలోని బ్యాక్టీరియాను తగ్గించి, మరకలను తొలగించడానికి సహాయపడుతుంది.
Image credits: Freepik
Telugu
నారింజ తొక్క
నారింజ పండు తొక్కతో పళ్లను శుభ్రం చేసుకోవడం వల్ల పసుపు మరకలు పోతాయి. దంతాలు మరింత ప్రకాశవంతంగా మారతాయి.
Image credits: Getty
Telugu
అరటి తొక్క
అరటిపండు తొక్క లోపలి భాగంతో పళ్లపై ఐదు నిమిషాల పాటు రుద్దాలి. ఇలా చేయడం వల్ల పళ్లపై ఉన్న పసుపుదనం పోతుంది.
Image credits: Gemini AI
Telugu
బేకింగ్ సోడా
బేకింగ్ సోడాను పేస్టులా చేసి, దాంతో పళ్లు తోముకోవాలి. ఇది పళ్లపై ఉన్న మరకలను లోతుగా శుభ్రం చేసి, వాటిని తొలగిస్తుంది.
Image credits: Freepik
Telugu
వెనిగర్
కొద్దిగా వెనిగర్‌ను బేకింగ్ సోడాతో కలిపి మిశ్రమంగా తయారుచేయాలి. ఆ తర్వాత ఈ పేస్టుతో పళ్లు తోముకోవాలి. అయితే, దీన్ని వారానికి ఒకసారి మాత్రమే చేయడం మంచిది.