Telugu

పెరుగు లేదా మజ్జిగ

ఎండాకాలంలో వేడిని తట్టుకోవడానికి ఈ రెండు పానీయాలలో ఏది తాగితే ఆరోగ్యానికి ఎక్కువ మంచిదో తెలుసుకుందాం.

Telugu

ఎండాకాలం

ఎండాకాలంలో పెరుగు, మజ్జిగ తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు.

Image credits: AI Meta
Telugu

భూమిపై ఉన్న అమృతం

ఆయుర్వేదంలో మజ్జిగను 'భూమిపై ఉన్న అమృతం' అని పిలుస్తారు. మరోవైపు, పెరుగులో కూడా శక్తి, పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

Image credits: AI Meta
Telugu

ప్రోబయోటిక్స్

పెరుగు, మజ్జిగ రెండింటిలోనూ ప్రోబయోటిక్స్ ఉంటాయి. కానీ వేడిని తగ్గించడంలో పెరుగు కన్నా మజ్జిగనే ఉత్తమమైన పానీయంగా భావిస్తారు.

Image credits: AI Meta
Telugu

జీర్ణక్రియకు ఏది మేలు?

పెరుగు చిక్కగా, మజ్జిగ పల్చగా ఉంటుంది. అందుకే ఎండాకాలంలో మజ్జిగ జీర్ణక్రియకు బాగా సహాయపడుతుంది. రెండింటిలోనూ మంచి బ్యాక్టీరియా ఉంటుంది.

Image credits: AI Meta
Telugu

డీహైడ్రేషన్ సమస్యకు చెక్

మజ్జిగలో నీటిశాతం ఎక్కువగా ఉంటుంది. ఇది శరీర సమతుల్యతకు సహాయపడుతుంది. ఎండాకాలంలో డీహైడ్రేషన్ సమస్య రాకుండా మజ్జిగ కాపాడుతుంది.

Image credits: AI Meta
Telugu

బరువు తగ్గడానికి...

బరువు తగ్గాలనుకునే వారికి పెరుగు కంటే మజ్జిగ తాగడమే ఉత్తమం. ఎందుకంటే పెరుగుతో పోలిస్తే మజ్జిగలో కొవ్వు, కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి.

Image credits: AI Meta
Telugu

అసిడిటీ సమస్య

ఫాస్ట్ ఫుడ్ లేదా మసాలా ఎక్కువగా ఉన్న ఆహారం తిన్న తర్వాత గ్లాసు మజ్జిగ తాగితే అసిడిటీ తగ్గుతుంది. కడుపులో మంట నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది.

Image credits: AI Meta
Telugu

బయటకు వెళ్లే ముందు...

ఎండాకాలంలో బయటకు వెళ్లే ముందు ఓ గ్లాసు మజ్జిగ తాగితే శరీరం చల్లగా ఉంటుంది. వడదెబ్బ బారిన పడకుండా సులభంగా కాపాడుకోవచ్చు.

Image credits: AI Meta

Papaya Benefits: రోజూ బొప్పాయి తింటే చాలు.. ఈ జబ్బులన్నీ పరార్!

Green Tea: రోజూ ఓ కప్పు గ్రీన్ టీ తాగితే ఏమవుతుంది?

Gas Relief Tips: ఈ ఒక్క డ్రింక్‍తో కడుపు ఉబ్బరం, గ్యాస్‌ సమస్య దూరం!

Ghee Benefits: పిల్లలకు రోజూ నెయ్యి ఎందుకు పెట్టాలో తెలుసా?