తేనె రుచికరమైనదే కాదు, పోషకాలతో నిండి ఉంటుంది. దీనివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ, పరగడుపున తీసుకోవడం వల్ల కొన్ని సమస్యలు కూడా రావచ్చు.
పరగడుపున గోరువెచ్చని నీటిలో తేనె ఎక్కువగా కలిపి తాగితే.. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవచ్చు.
పరగడుపున తేనెను ఎక్కువగా తీసుకుంటే కడుపు నొప్పి లేదా విరేచనాలకు దారితీస్తుంది. జీర్ణవ్యవస్థపై ఇది భారం మోపుతుంది.
కొందరికీ తేనె పడకపోవచ్చు. దానివల్ల దురద, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటివి ఎదురుకావచ్చు. కాబట్టి అలెర్జీ సమస్యలు ఉన్నవారు తేనెకు దూరంగా ఉండటం మంచిది.
తేనెలో ఉండే సహజ చక్కెరలు, దాని ఆమ్ల స్వభావం పంటి ఎనామిల్‌ను దెబ్బతీస్తాయి. దీనివల్ల దంతాలు బలహీనపడతాయి.
తేనెను ఎక్కువగా తీసుకుంటే అనవసరంగా బరువు పెరుగుతారు.
Stress Relief foods: ఒత్తిడిని తగ్గించే 6 సూపర్ ఫుడ్స్ ఇవిగో!
Summer Health: పెరుగు vs మజ్జిగ.. ఎండాకాలానికి ఏది మంచిది?
Papaya Benefits: రోజూ బొప్పాయి తింటే చాలు.. ఈ జబ్బులన్నీ పరార్!
Green Tea: రోజూ ఓ కప్పు గ్రీన్ టీ తాగితే ఏమవుతుంది?