High Cholesterol: ఈ లక్షణాలు మీలో ఉంటే.. అధిక కొలెస్ట్రాల్ ఉన్నట్లే !
health-life Jun 12 2025
Author: Rajesh K Image Credits:Getty
Telugu
పసుపు మచ్చలు
చర్మం కింద కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వల్ల కనురెప్పలపై పసుపు రంగు మొటిమలు కనిపిస్తాయి. అలాగే గోళ్లపై పసుపు మచ్చలు కనిపిస్తే అది అధిక కొలెస్ట్రాల్‌కి సంకేతం. వీటిని జాంటోమాస్ అంటారు.
Image credits: Getty
Telugu
కాళ్ళలో నొప్పి, తిమ్మిరి
శరీరంలో అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు.. నడిచేటప్పుడు కాళ్ళలో నొప్పి, తిమ్మిరి అనిపించవచ్చు. హై కొలెస్ట్రాల్ వల్ల రక్త ప్రసరణ సరిగ్గా జరగదు. సిరలు, ధమనుల్లో అడ్డంకులు ఏర్పడతాయి.
Image credits: Getty
Telugu
కండరాలు బలహీనత
ధమనులలో ఆక్సిజన్ లేకపోవడం వల్ల కండరాలు బలహీనంగా మారుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో నడవడానికి కూడా ఇబ్బంది పడుతారు. అలాగే మీరు ఎక్కువసేపు నిలబడలేరు.
Image credits: Getty
Telugu
తల తిరగడం
తల తిరగడం అధిక కొలెస్ట్రాల్‌కి ఓ సంకేతం. అధిక కొలెస్ట్రాల్ వల్ల రక్తనాళాలు సన్నబడతాయి, దీని వల్ల రక్తపోటు పెరుగుతుంది. దాని వల్ల తల తిరిగినట్టు అనిపించవచ్చు.
Image credits: Getty
Telugu
శ్వాస ఆడకపోవడం
మెట్లు ఎక్కుతున్నప్పుడు లేదా సాధారణ పనులు చేస్తున్నప్పుడు శ్వాస ఆడకపోవడం కొలెస్ట్రాల్‌కు సంకేతం కావచ్చు, కానీ ఇది గుండె జబ్బుల ప్రారంభ సంకేతం కూడా కావచ్చు.
Image credits: Getty
Telugu
అధిక అలసట
బాగా నిద్రపోయిన తర్వాత కూడా అలసటగా అనిపించడం అధిక కొలెస్ట్రాల్ లక్షణం కావొచ్చు.
Image credits: Getty
Telugu
శ్రద్ధ వహించండి:
పైన పేర్కొన్న లక్షణాలు కనిపిస్తే స్వీయ-నిర్ధారణకు ప్రయత్నించకుండా డాక్టర్‌ను సంప్రదించండి. దీని తర్వాత మాత్రమే వ్యాధిని నిర్ధారించండి.