పాలకూర ఆరోగ్యానికి మంచిదే. ఇందులో ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. కానీ, పాలకూర ఎక్కువగా తింటే.. కొందరికి గ్యాస్, ఉబ్బరం, అజీర్ణం వంటి జీర్ణ సంబంధిత సమస్యలు రావచ్చు.
Image credits: Getty
Telugu
కిడ్నీలో రాళ్ళు
రోజూ పాలకూర తింటే కిడ్నీలో రాళ్ళు వచ్చే ప్రమాదం ఉంది. ఎందుకంటే పాలకూరలో ఆక్సలేట్ అధికంగా ఉంటుంది. ఆక్సలేట్, కాల్షియం కలిసి, మూత్రంలో స్ఫటికాలు ఏర్పడవచ్చు.
Image credits: Getty
Telugu
థైరాయిడ్ సమస్య
థైరాయిడ్ సమస్య వున్నవాళ్లు పాలకూరను తినకూడదు. వీటిలో ఉండే గోయిట్రోజెన్ సమస్యను మరింత పెంచుతుంది.
Image credits: Getty
Telugu
అలెర్జీ సమస్య
కొంతమందికి పాలకూర పడదు. తిన్నవెంటనే అలర్జీ వంటి సమస్యలు వస్తాయి. మరికొందరిలో దురద, కణుతులు, కురుపులు రావొచ్చు. ఈ సమస్యలున్నవారు కూడా పాలకూరని అవాయిడ్ చేయడం మంచిది.
Image credits: social media
Telugu
కీళ్ల సమస్యలు
పాలకూరలో కాల్షియం ఉన్నా అది ఆక్సలేట్ రూపంలో ఉండటం వల్ల, శరీరంలో కాల్షియం శోషణను తగ్గిస్తుంది. ఆక్సలేట్లు కాల్షియంతో బంధించి, దాని శోషణను అడ్డుకుంటాయి. దీంతో కీళ్ల సమస్యలు రావొచ్చు.