వయసును బట్టి నిద్ర.. మీరు ఎన్ని గంటలు నిద్రపోవాలో తెలుసా?
health-life Jun 11 2025
Author: Rajesh K Image Credits:Getty
Telugu
ఎంతసేపు నిద్రించాలి?
ఆరోగ్యంగా ఉండాలంటే నిద్ర చాలా ముఖ్యం. నిద్ర లేకపోవడం వల్ల శరీరంలో అనేక వ్యాధులు వస్తాయి. మన మొత్తం ఆరోగ్యాన్ని నిద్ర ప్రభావితం చేస్తుంది. అలాగే.. వయసును బట్టి నిద్ర సమయం మారుతుంది.
Image credits: unsplash
Telugu
పుట్టినప్పటి నుండి 3 నెలల వరకు
పుట్టిన పిల్లలు మూడు నెలల వరకు రోజుకు కనీసం 14 - 17 గంటలు నిద్రపోవాలి.
Image credits: Freepik@photohobo
Telugu
4 నెలల నుండి 1 సం,, వరకు
4 నెలల నుండి 1 సంవత్సరం వరకు ఉన్న పిల్లలు రోజుకు 12 - 15 గంటల వరకు నిద్రపోవాలి. ఇది వారి పెరుగుదల, అభివృద్ధికి చాలా అవసరం. ఈ సమయంలో పిల్లలు రాత్రిపూట నిద్రపోవడానికి అలవాటు పడతారు.
Image credits: Pexels
Telugu
3-5 ఏళ్ల పిల్లలు
3-5 ఏళ్ల వరకు ఉన్న పిల్లలు 10 - 13 గంటల వరకు నిద్రపోవాలి. ఇది ఆరోగ్యకరమైన ఎదుగుదల, అభివృద్ధికి చాలా ముఖ్యం.
Image credits: Pinterest
Telugu
6-12 సంవత్సరాలు ఉన్న పిల్లలు
పాఠశాలకు వెళ్లే వయసు ఉన్న ఈ పిల్లల నిద్ర వ్యవధి రోజూ 9-12 గంటలుగా ఉండాలి.
Image credits: Pinterest
Telugu
13-18 ఏళ్లు ఉన్నవారు
13 నుండి 18 ఏళ్ల మధ్య వయస్సు గల వారు రోజూ 8 నుండి 10 గంటల నిద్ర పోవాలి. కానీ చాలా మంది టీనేజర్లు తగినంత నిద్ర పోరు. దీనివల్ల వారి శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది
Image credits: Freepik
Telugu
18-60 ఏళ్లు ఉన్నవారు
18-60 ఏళ్లు ఉన్నవారు ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ 7-9 గంటలు నిద్ర పోవాలి.
Image credits: Freepik
Telugu
60 ఏండ్లు పైబడినవారు
ఈ ఏజ్ లో వారి శరీర ప్రక్రియలు నెమ్మదిస్తాయి. చాలా మందిలో కీళ్ల నొప్పులు, నిద్రలేమి వంటి ఆరోగ్య పరిస్థితుల కారణంగా ఇబ్బంది పడుతుంటారు. వీరికి డైలీ 7-8 గంటలు నిద్ర అవసరం.