Lip care: పగిలిన పెదాలు మృదువుగా మారాలంటే ఇలా చేయండి!
health-life Jul 27 2025
Author: Rajesh K Image Credits:our own
Telugu
కొబ్బరి నూనె
పగిలిన పెదవులను మృదువుగా మార్చడంలో కొబ్బరి నూనె సహాయపడుతుంది. రోజులో కనీసం ఒక్కసారైనా పెదవులకు కొబ్బరి నూనెను అప్లై చేస్తే, మృదువుగా అవ్వడంతో పాటు గాయాలు తగ్గుతాయి.
Image credits: Freepik
Telugu
తేనె
తేనెలో ప్రకృతిసిద్ధమైన యాంటీబాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇది పగిలిన పెదవులను మృదుత్వంగా మార్చి, గాయాలను త్వరగా మానేందుకు సహాయపడుతుంది.
Image credits: Getty
Telugu
నిమ్మరసం, బాదం నూనె
నిమ్మరసం, బాదం నూనె కలసి పెదవులపై రాస్తే నలుపు తగ్గించి సహజ రంగు తిరిగి వచ్చేలా చేస్తాయి. ఈ మిశ్రమాన్ని రోజూ రాత్రి పడుకునే ముందు పెదవులకు అప్లై చేయండి.
Image credits: pinterest
Telugu
కలబంద జెల్
కలబంద (ఆలోవెరా) జెల్‌లో ఉన్న తేమ, శీతల లక్షణాలు పొడిబారిన పెదవులకు సహజ నిగారింపును ఇస్తాయి. రోజుకు ఒక్కసారైనా ఆలోవెరా జెల్‌ను పెదవులకు రాస్తే మృదువుగా మారుతాయి.
Image credits: Getty
Telugu
దోసకాయ
దోసకాయ అద్భుతమైన హైడ్రేటింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. దోసకాయ గుజ్జును పెదవులకు రాసి, కొన్ని నిమిషాలు వదిలివేస్తే, పొడి, పగిలిన పెదవులు తేమతో నిండిపోతాయి.