Hemoglobin: మీ రక్తంలో హిమోగ్లోబిన్ పెరగాలంటే.. ఈ ఐదు జ్యూసులు తాగండి!
health-life Jul 27 2025
Author: Rajesh K Image Credits:Getty
Telugu
ఆరోగ్య సమస్యలు
రక్తంలో హిమోగ్లోబిన్ తగ్గడం వల్ల తక్కువ ఆక్సిజన్ సరఫరా అవుతుంది, దాంతో అలసట, నీరసం, మైకాలు, శ్వాస సంబంధిత ఇబ్బందులు వంటి ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి.
Image credits: Getty
Telugu
హెల్తీ జ్యూస్‌లు
హిమోగ్లోబిన్‌ను పెంచి, రక్తహీనతను తగ్గించే ఐదు ఆరోగ్యకరమైన జ్యూస్‌ల గురించి తెలుసుకోండి.
Image credits: Freepik
Telugu
ఉసిరి జ్యూస్
ఉసిరి జ్యూస్ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది, ఐరన్ శోషణకు తోడ్పడుతుంది. హిమోగ్లోబిన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. ఈ జ్యూస్ లో విటమిన్ C అధికంగా ఉంటుంది.
Image credits: Getty
Telugu
బీట్ రూట్ జ్యూస్
బీట్ రూట్ లో ఐరన్, ఫోలేట్ పుష్కలంగా ఉంటాయి.ఇవి హిమోగ్లోబిన్ స్థాయిని పెంచడంలో అలాగే ఎర్ర రక్తకణాల ఉత్పత్తిని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇది రక్తహీనతకు ఒక సహజ నివారణ.
Image credits: Getty
Telugu
చెరకు రసం
చెరకు రసంలో ఇనుము, కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. వీటి వల్ల హిమోగ్లోబిన్ పెరుగుతుంది.
Image credits: Gemini
Telugu
దానిమ్మ రసం
హిమోగ్లోబిన్ పెరుగుదలకు ఉపయోగపడే బెస్ట్ ఛాయిస్ దానిమ్మ జ్యూస్. ఇందులో ఐరన్, విటమిన్ C వంటి ఇతర ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఈ జ్యూస్ రక్తహీనతను తగ్గించడంలో సహాయపడుతుంది.
Image credits: Getty
Telugu
ఆపిల్ జ్యూస్
ఆపిల్స్‌లో ఐరన్, విటమిన్ C పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచేందుకు సహాయపడతాయి. రక్తహీనతను తగ్గించడంలో ఆపిల్ జ్యూస్ బెస్ట్ ఛాయిస్.