Health
కెమికల్ బ్లీచ్ కొన్నిసార్లు చర్మానికి హాని చేస్తుంది. దీనివల్ల చర్మం పొడిబారడం, దద్దుర్లు, మంట లాంటి సమస్యలు వస్తాయి.
సహజంగా చర్మం మెరిసిపోవాలంటే సహజసిద్ధమైన పదార్థాలతో చేసిన బ్లీచ్ మంచి ఎంపిక.
టమాటో రసం చర్మంపై టాన్ తొలగించడానికి సహాయపడుతుంది. దీని కోసం 1 టమాటో రసంలో 1 స్పూన్ నిమ్మరసం కలపండి. ముఖానికి 15 నిమిషాలు పట్టించండి. గోరువెచ్చని నీటితో కడిగేయండి.
శనగపిండి టాన్, డెడ్ స్కిన్ తొలగించడానికి సహాయపడుతుంది. 2 స్పూన్ల పెరుగులో 1 స్పూన్ శనగపిండి కలిపి ముఖానికి పట్టించి, 20 నిమిషాలు ఆరనివ్వండి. నెమ్మదిగా రుద్దుతూ కడిగేయాలి.
బొప్పాయితో సహజ బ్లీచ్ చేయడానికి, అర కప్పు పండిన బొప్పాయిని మెత్తగా చేయండి. అందులో 1 స్పూన్ తేనె కలపండి, దీన్ని 15 నిమిషాలు ముఖానికి పట్టించి, ఆపై కడిగేయండి.