Constipation Relief: మలబద్ధకంతో ఇబ్బంది పెడుతుందా? ఈ చిట్కాలు మీకోసమే!
health-life Jul 28 2025
Author: Rajesh K Image Credits:Getty
Telugu
ఉదయం ఎండుద్రాక్ష నీరు
ఎండుద్రాక్షలో అధికంగా ఫైబర్ ఉంటుంది. కాబట్టి రాత్రి నానబెట్టిన ఎండుద్రాక్ష నీటిని ఉదయాన్నే తాగితే మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరుచుతుంది.
Image credits: Getty
Telugu
ఓట్స్
ఫైబర్ అధికంగా ఉండే ఓట్స్‌ను ఉదయాన్నే తీసుకోవడం ద్వారా జీర్ణవ్యవస్థ మెరుగవుతుంది. ఇది మలాన్ని మృదువుగా మార్చి మలబద్ధకాన్ని సహజంగా నివారించడంలో సహాయపడుతుంది.
Image credits: Getty
Telugu
ఆరెంజ్ జ్యూస్
ఆరెంజ్ పండులో ఫైబర్, సిట్రస్ అధికంగా ఉంటుంది. కాబట్టి ఉదయాన్నే తాజా ఆరెంజ్ జ్యూస్ తాగడం వల్ల జీర్ణవ్యవస్థను ఉత్తేజపరుస్తుంది. మలబద్ధకాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
Image credits: Getty
Telugu
ప్రూన్స్ జ్యూస్
ప్రూన్స్ అంటే ఎండిన రేగు పండ్లు. వీటిలోని ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి వీటిని రాత్రి నానబెట్టి ఉదయాన్నే తినడం ద్వారా మలబద్ధకం సమస్యను సహజంగా తగ్గించుకోవచ్చు.
Image credits: Getty
Telugu
బొప్పాయి రసం
ఫైబర్ అధికంగా ఉండే బొప్పాయి రసం జీర్ణవ్యవస్థను ఉత్తేజింపజేస్తుంది. ఉదయాన్నే తాజా బొప్పాయి రసం తాగడం వల్ల మలబద్ధక సమస్య సహజంగా తగ్గుతుంది.
Image credits: Getty
Telugu
జామకాయ
ఫైబర్ పుష్కలంగా ఉండే జామకాయ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. జామకాయను తినడం ద్వారా మలాన్ని మృదువుగా మార్చి మలబద్ధకాన్ని సహజంగా తగ్గించవచ్చు.
Image credits: Getty
Telugu
పెరుగు
ప్రోబయోటిక్ లక్షణాలు కలిగిన పెరుగు జీర్ణవ్యవస్థలో మంచిబాక్టీరియాను పెంచుతుంది. ఉదయాన్నే పెరుగు తీసుకోవడం ద్వారా మలబద్ధకాన్ని సహజంగా తగ్గించవచ్చు