మెగ్నీషియం లోపం వల్ల కండరాల నొప్పులు, ఎముకల బలహీనత వంటివి రావచ్చు.
మెగ్నీషియం లోపం వల్ల హార్ట్ బీట్ లో తేడాలు రావచ్చు.
మెగ్నీషియం లోపం మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. దీని వల్ల డిప్రెషన్, ఆందోళన, మూడ్ స్వింగ్స్ వంటివి రావచ్చు.
మెగ్నీషియం లోపం ఉన్నవారిలో అలసట, నీరసం ఎక్కువగా ఉంటాయి.
చాక్లెట్ కోరిక కూడా మెగ్నీషియం లోపాన్ని సూచిస్తుంది.
నిద్రలేమి, తలనొప్పి, వాంతులు, కడుపు నొప్పి కూడా మెగ్నీషియం లోపం వల్ల రావచ్చు.
గుమ్మడికాయ గింజలు, అరటిపండ్లు, బ్రౌన్ రైస్, పెరుగు, నువ్వులు, బాదం, పాలకూర, అవిసె గింజలు, పప్పులు, డార్క్ చాక్లెట్ వంటి వాటిలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది.
పైన చెప్పిన లక్షణాలు ఉన్నంత మాత్రాన మెగ్నీషియం లోపం ఉందని అనుకోకండి. ఈ లక్షణాలు ఉన్నవారు వైద్యుడిని సంప్రదించాలి.