Telugu

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యంతో బోలెడు హెల్త్ బెనిఫిట్స్!

Telugu

కార్బోహైడ్రేట్లు పుష్కలం

సగ్గుబియ్యంలో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరానికి శక్తినిస్తుంది. అంతేకాకుండా ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. కొవ్వులు అస్సలు ఉండవు.

Image credits: Freepik
Telugu

బెస్ట్ బ్రేక్ ఫాస్ట్

సగ్గుబియ్యాన్ని ఉడికించి లేదా వేయించి అల్పాహారంగా తీసుకోవచ్చు. ఇది రోజంతా శరీరాన్ని ఉత్తేజంగా ఉంచుతుంది. ఎక్కువగా తినాలనే కోరికను తగ్గిస్తుంది.

Image credits: Social Media
Telugu

బరువు నియంత్రణ

జగ్గు బియ్యం జీర్ణం కావడానికి సమయం పడుతుంది కాబట్టి మీ కడుపు ఎక్కువసేపు నిండి ఉంటుంది. ఇది తరచుగా తినడాన్ని నిరోధించి బరువును నియంత్రిస్తుంది.

Image credits: Freepik
Telugu

అధిక కార్బోహైడ్రేట్స్

వ్యాయామానికి ముందు సగ్గుబియ్యం తింటే శరీరానికి అవసరమైన కార్బోహైడ్రేట్లను అందిస్తుంది. వ్యాయామం తర్వాత పెరుగు (లేదా) పండ్లతో కలిపి తింటే కండరాల కోలుకోవడానికి సహాయపడుతుంది.

Image credits: Pinterest
Telugu

తక్కువ కేలరీలు

సగ్గుబియ్యంతో కిచిడి (లేదా) ఉప్మా తయారుచేసేటప్పుడు తక్కువ నూనె, ఎక్కువ ఆకుకూరలు వాడి వండుకోవాలి. ఇది తినడానికి రుచిగా ఉంటుంది, కేలరీలను తగ్గిస్తుంది.

Image credits: social media
Telugu

జీర్ణక్రియ

రాత్రి సగ్గుబియ్యం తింటే జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. అందువల్ల రాత్రిపూట దాన్ని తినకూడదు. ఉదయం లేదా మధ్యాహ్నం తింటే అది తేలికగా జీర్ణమవుతుంది.

Image credits: Freepik
Telugu

మితంగా తినండి

బరువు తగ్గడానికి సగ్గుబియ్యాన్ని రోజుకు ఒక గిన్నె తింటే సరిపోతుంది. ఎక్కువగా తింటే ప్రతికూల ప్రభావం చూపుతుంది.

Image credits: Social Media

Osteoporosis: ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? మీలో ఆ లోపం ఉన్నట్లే..

మీ ముఖంపై ఈ లక్షణాలు కనిపిస్తే.. మీరు ప్రమాదంలో ఉన్నట్టే..

జిమ్‌కి వెళితే.. వ్యాయామానికి ఎంత సమయం తరువాత ఆహారం తీసుకోవాలో తెలుసా?

Blood Pressure: బీపీ సడన్‌గా డౌన్ అయిపోతే.. వెంటనే ఇలా చేయండి