జిమ్‌కి వెళితే.. వ్యాయామానికి ఎంత సమయం తరువాత ఆహారం తీసుకోవాలో తెలుసా?
health-life May 26 2025
Author: Rajesh K Image Credits:Getty
Telugu
వ్యాయామం తర్వాత ఎప్పుడు తినాలి?
వ్యాయామం చేసిన తర్వాత లేదా జిమ్‌కి వెళ్లిన తర్వాత సుమారు అరగంట (లేదా) గంటలోపు తేలికపాటి, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. ఇది కండరాల పెరుగుదలకు సహాయపడుతుంది.
Image credits: Pinterest
Telugu
ఎందుకు తినాలి?
వ్యాయామం తర్వాత వెంటనే తింటే శరీరం పోషకాలను త్వరగా గ్రహిస్తుంది. సరైన సమయంలో తినకపోతే శరీరంలో అలసట, బలహీనత, కండరాలకు నష్టం కలిగే ప్రమాదముంది.
Image credits: Social Media
Telugu
ఏ ఆహారం తినాలి?
వ్యాయామం తర్వాత ఎక్కువ ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు ఉన్న ఆహారం తినడం మంచిది. ఇది కండరాలను బలోపేతం చేసి, శరీరానికి శక్తినిస్తుంది.
Image credits: Getty
Telugu
వ్యాయామం తర్వాత బెస్ట్ ఫుడ్
అరటిపండు, ఉడికించిన గుడ్డు, ఓట్స్, చీజ్, పెసరపప్పు, డ్రై ఫ్రూట్స్, స్మూతీ వంటివి తినడం ఆరోగ్యానికి మంచిది. ఇవి త్వరగా జీర్ణమై శరీరానికి శక్తినిస్తాయి.
Image credits: freepik
Telugu
నీళ్లు తాగండి
వ్యాయామం చేసేటప్పుడు చెమట ఎక్కువగా పోవడం వల్ల నీటి కొరత ఏర్పడుతుంది. కాబట్టి వ్యాయామం తర్వాత ముందుగా నీళ్లు (లేదా) నిమ్మరసం తాగండి. ఇది శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది.
Image credits: social media
Telugu
గుర్తుంచుకోండి
వ్యాయామం తర్వాత అలసిపోయి ఉంటారు. కాబట్టి వెంటనే తినకుండా కొన్ని నిమిషాలు విశ్రాంతి తీసుకోండి. తర్వాత గంటలోపు తేలికపాటి ఆహారం తినండి.