Kidney Stone: ఈ లక్షణాలు ఉంటే.. కిడ్నీ హెల్త్ ప్రమాదంలో పడుతున్నట్లే!
health-life Jun 20 2025
Author: Rajesh K Image Credits:Getty
Telugu
పనితీరు మందగించడం
మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడితే కిడ్నీ పనితీరు మందగించి.. కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే అవకాశముంది. రాళ్ల వల్ల మూత్ర నాళాన్ని బ్లాక్ అయ్యి.. ఇన్ఫెక్షన్, అధిక రక్తపోటు వంటి సమస్యలు వస్తాయి
Image credits: Getty
Telugu
భరించలేని నొప్పి
కిడ్నీల్లో రాళ్ల సమస్య ఉంటే భరించలేని నొప్పి ఉంటుంది. కిడ్నీలో స్టోన్స్ కారణంగా విపరీతమైన కడుపు నొప్పి, నడుము నొప్పి వస్తాయి. ఈ నొప్పిని తట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది.
Image credits: Getty
Telugu
మూత్రంలో రక్తం
మూత్రంలో రక్తం, తరచుగా మూత్ర విసర్జన, మూత్రం రంగు మారడం కూడా కిడ్నీ స్టోన్స్ లక్షణాలు కావచ్చు.
Image credits: Getty
Telugu
దుర్వాసన
కిడ్నీ స్టోన్స్ వల్ల మూత్రంలో దుర్వాసన వస్తుంది. పురుషుల కంటే మహిళల్లో యూరిన్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉన్నాయి. మూత్రంలో మంటతో పాటు దుర్వాసన ఉంటే అది కిడ్నీల్లో రాళ్లను సూచిస్తుంది
Image credits: Getty
Telugu
వికారం
తరచుగా వికారంగా అనిపిస్తే అది మూత్రపిండ సంబంధిత వ్యాధికి లక్షణం కావచ్చు. కిడ్నీల్లో రాళ్లు ఉంటే రక్తంలో విష పదార్థాలు పెరుగుతాయి. దీని వలన వికారంతో పాటు వాంతులు కూడా అవుతాయి.
Image credits: Getty
Telugu
అలసట
అలసట, నిద్రలేమి, కాళ్ళ వాపు, నిలబడటం లేదా కూర్చోవడంలో ఇబ్బంది వంటివి కూడా మూత్రపిండ సంబంధిత వ్యాధికి లక్షణం కావచ్చు
Image credits: Getty
Telugu
గమనిక
పైన పేర్కొన్న లక్షణాలు కనిపిస్తే, స్వయంగా వ్యాధి నిర్ధారణ చేసుకోకుండా డాక్టర్‌ను సంప్రదించండి. వైద్య పరీక్షల తర్వాత మాత్రమే వ్యాధిని నిర్ధారించుకోండి.