Telugu

Health Tips: ఈ సూపర్ ఫుడ్స్ తింటే.. చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుందట..

Telugu

ఓట్స్

ఓట్స్‌లో ఫైబర్‌ పుష్కలంగా ఉంటుంది. వీటిిని తినడం వల్ల ఫైబర్‌ కొలెస్ట్రాల్‌ని కరిగించి బయటికి పంపుతుంది. ఇవి గుండె కూడా మంచివి. ఓట్స్‌ని చాలా రకాలుగా తీసుకోవచ్చు. 

Image credits: Getty
Telugu

అవకాడో

అవకాడోలో మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు (MUFAs), ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ (LDL) ని తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ (HDL) ని పెంచడంలో సహాయపడతాయి. 

Image credits: Getty
Telugu

బెర్రీ పండ్లు

బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, రాస్ప్బెర్రీ వంటి బెర్రీ పండ్లు కూడా కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడతాయి.

Image credits: Getty
Telugu

ఆకుకూరలు

పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే పాలకూర వంటి ఆకుకూరలు తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. 

Image credits: Getty
Telugu

టమాటా

టొమాటోలోని లైకోపీన్ కూడా చెడు కొలెస్ట్రాల్ (LDL), ట్రైగ్లిజరైడ్‌లను తగ్గించడంలో సహాయపడుతుంది. టొమాటోలో ఉండే ఫైబర్స్ శరీరంలో కొలెస్ట్రాల్ శోషణను కూడా తగ్గిస్తుంది.

Image credits: Getty
Telugu

పప్పు ధాన్యాలు

ఫైబర్స్, ప్రోటీన్లు పుష్కలంగా ఉండే పప్పు ధాన్యాలు కూడా కొలెస్ట్రాల్‌ని నియంత్రించడంలో సహాయపడతాయి.

Image credits: Getty
Telugu

బాదం, వాల్‌నట్స్

ఆరోగ్యకరమైన కొవ్వులు కలిగి ఉండటం వల్ల బాదం, వాల్‌నట్స్ వంటి నట్స్ తినడం కూడా కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడుతుంది.

Image credits: Getty

Bone health: 30 రోజుల్లో ఎముకలు బలంగా మారాలంటే.. ఇవి తినాల్సిందే!

Dementia: మీలో ఈ లక్షణాలు ఉన్నాయా? అయితే.. డిమెన్షియా వ్యాధి కావొచ్చు?

వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు... ఈ టిప్స్ పాటిస్తే మేలు..

Uric Acid Symptoms: రాత్రివేళ పాదాల్లో నొప్పా? ఆ వ్యాధి కావొచ్చు..