Telugu

వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు... ఈ టిప్స్ పాటిస్తే మేలు..

Telugu

అంటువ్యాధుల ప్రమాదం

వేసవి ఉక్కపోత నుండి వర్షాకాలం ఉపశమనం కలిగిస్తుందేమో గానీ, ఇది అనేక వ్యాధులు, అంటువ్యాధుల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. మన రోగనిరోధక శక్తి తగ్గుతుంది.

Image credits: social media
Telugu

నివారణ చర్యలు

వర్షాకాలంలో సాధారణంగా కొన్ని వ్యాధులు ఎక్కువగా వస్తాయి. ఈ వ్యాధులు ఏమిటి? వాటిని నివారించడానికి కొన్ని నివారణ చర్యల గురించి ఇక్కడ తెలుసుకోండి.

Image credits: Getty
Telugu

డెంగ్యూ జ్వరం

డెంగ్యూ జ్వరం పగటిపూట కుట్టే ఈడీస్ దోమల ద్వారా వ్యాపిస్తుంది. ముఖ్యంగా ఏడిస్ ఈజిప్టి దోమ డెంగ్యూ వైరస్ ను వ్యాప్తి చేస్తుంది.  

Image credits: Freepik
Telugu

ఏడీస్ దోమలు

ఏడిస్ దోమలు ఇళ్లు, భవనాలు, నీరు నిల్వ ఉన్న చోట గుడ్లు పెడతాయి. ముఖ్యంగా డెంగ్యూ వంటి వ్యాధులను వ్యాప్తి చేసేవి ఏడిస్ దోమలే.  

Image credits: Google
Telugu

చికున్ గున్యా

నిల్వ ఉన్న నీటిలో దోమలు పెరుగుతాయి, ఈ దోమలు చికున్‌గున్యా వ్యాధిని వ్యాప్తి చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి.  ఏడెస్ దోమలు  చికున్‌గున్యాకు కారణమయ్యే వైరస్‌ను వ్యాప్తి చేస్తాయి.

Image credits: Getty
Telugu

మలేరియా

ఆడ అనాఫిలిస్ దోమ కాటు ద్వారా మలేరియా వ్యాపిస్తుంది. ఇది వర్షాకాలంలో వచ్చే సాధారణ వ్యాధులలో ఒకటి. జ్వరం, చలి, కండరాల నొప్పులు, బలహీనత మలేరియా ప్రధాన లక్షణాలు.

Image credits: Getty
Telugu

టైఫాయిడ్

టైఫాయిడ్ వ్యాధి నీటి ద్వారా వ్యాపిస్తుంది. ఈ వ్యాధి అపరిశుభ్రత వల్ల వస్తుంది. కలుషితమైన ఆహారం, నీటిని తీసుకోవడం ద్వారా టైఫాయిడ్ వ్యాపిస్తుంది.

Image credits: Social media
Telugu

వైరల్ ఫీవర్

వైరల్ ఫీవర్ కూడా సీజనల్ వ్యాధే.. సాధారణంగా వచ్చే జబ్బు, వర్షాకాలంలో ఇది ఎక్కువగా వస్తుంది. జ్వరం, జలుబు, దగ్గు వంటివి దీని సాధారణ లక్షణాలు.

Image credits: Getty
Telugu

నిల్వ నీటిని తొలగించండి

ఇంట్లో లేదా మురుగు కాలువలో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. అలాగే, ఇంట్లో దోమలను తరిమేందుకు మస్కిటో రిపెల్లెంట్స్ వాడండి.  జలుబు, ఫ్లూ వంటి సీజన్ వ్యాధులకు దూరంగా ఉండండి.   

Image credits: Getty
Telugu

పరిసరాల పరిశుభ్రత

వర్షాకాలంలో దోమల నుంచి మరింత జాగ్రత్తగా ఉండాలి. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడంతోపాటు ఇంట్లో లేదా మురుగు కాలువలో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి

Image credits: Getty

Uric Acid Symptoms: రాత్రివేళ పాదాల్లో నొప్పా? ఆ వ్యాధి కావొచ్చు..

Belly Fat: ఈ టిప్స్ పాటిస్తే.. బెల్లీ ఫ్యాట్ ఈజీగా తగ్గుతుందట!

Beauty Tips: ఏజ్ పెరిగినా యంగ్ గా కనిపించాలా? ఈ టిప్స్ పాటిస్తే చాలు..

High Blood Pressure: హై బీపీని ఇట్టే తగ్గించే అద్భుతమైన సీడ్స్..