International Yoga Day 2025: ఉత్తమ యోగా ఉపకరణాలు ఇవే..
health-life Jun 19 2025
Author: Rajesh K Image Credits:pinterest
Telugu
యోగా మ్యాట్
యోగా మ్యాట్ అనేది యోగా అభ్యాసానికి పునాది. యోగా మ్యాట్ లేకుండా యోగా చేస్తే గాయాలు అవుతాయని భయపడతారు. ఇది శరీరాన్ని సమతుల్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. దీనిపై వ్యాయామాలు చేయడం సులభం.
Image credits: pinterest
Telugu
యోగా స్ట్రాప్
దీనినే యోగా బెల్ట్ అని కూడా పిలుస్తారు. ఈ బెల్ట్ తో యోగాసనాలను మరింత మెరుగ్గా వేయవచ్చు. శరీరాన్ని పూర్తిగా సాగదీయలేని వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది.
Image credits: pinterest
Telugu
మెడిటేషన్ కుషన్
ధ్యానం చేసేటప్పుడు సౌకర్యవంతంగా కూర్చోవడానికి ఉపయోగపడే ప్రత్యేక రకమైన దిండు. ఇది శరీరానికి సపోర్టు ఇచ్చి, ధ్యానంపై దృష్టి పెట్టడానికి సహాయపడుతుంది. ఇవి వివిధ ఆకారాలలో లభిస్తాయి.
Image credits: pinterest
Telugu
యోగా బ్లాక్స్
యోగా బ్లాక్‌లు ప్రారంభ, అనుభవజ్ఞులైన యోగాభ్యాసకులకు సహాయపడతాయి. ఇవి కష్టమైన భంగిమలు చేయడానికి ఉపయోగపడుతాయి. కార్క్ లేదా ఫోమ్ బ్లాక్ ఉన్న యోగా బ్లాక్‌ను ఎంచుకోవడం బెస్ట్.
Image credits: pinterest
Telugu
యోగా డ్రెస్
యోగా సాధన చేసేటప్పుడు చర్మానికి గాలి తగిలేలా, సాగే, చెమటను త్వరగా పీల్చుకునే దుస్తువులను ధరించడం మేలు. మంచి బ్రాండ్ దుస్తులు ఎంచుకోవడం వలన నాణ్యత, మన్నిక, సౌకర్యవంతంగా ఉంటాయి.
Image credits: pinterest
Telugu
యోగా వీల్
యోగాభ్యాసాన్ని మరింత లోతుగా చేయడానికి యోగా వీల్ ఉపయోగపడుతుంది. చక్రాసనం, బ్యాక్‌బెండ్‌లు లేదా ఇన్‌వర్షన్‌ల వంటి కష్టమైన యోగా భంగిమలను సులభంగా చేయడానికి ఈ యోగా వీల్ ఉపయోగపడుతుంది.
Image credits: pinterest
Telugu
నీటి బాటిల్
యోగా సమయంలో నీరు త్రాగడం చాలా ముఖ్యం. మీరు రాగి లేదా స్టీల్ బాటిల్‌ను ఉపయోగించవచ్చు. అలాగే, గాజు బాటిల్‌ను కూడా ఉపయోగించవచ్చు.