Telugu

International Yoga Day: యంగ్, ఫిట్‌గా కనిపించాలా? ఈ ఆసనాలు వేస్తే చాలు

Telugu

సూర్య నమస్కారం (Surya Namaskar)

సాంప్రదాయ యోగాలో సూర్య నమస్కారం చాలా శక్తివంతమైనది. ఇది శరీరానికి, మనస్సుకు ఉపయోగపడే వ్యాయామం. ఇందులో 12 భంగిమలుంటాయి. ఈ ప్రక్రియ ద్వారా శరీరంలోని అన్ని భాగాలు యాక్టివేట్ అవుతాయి.

Image credits: our own
Telugu

భుజంగాసనం (Cobra pose)

దీనినే కోబ్రా ఆసనం అంటారు. ఇది వెన్నెముకను బలోపేతం చేస్తుంది. అలాగే ఒత్తిడిని తగ్గించడానికి, ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడుతుంది.

Image credits: instagram
Telugu

ధనురాసనం (Dhanurasana)

దీనినే ‘విల్లు ఆసనం’ అంటారు. ఈ ఆసనంలో శరీరాన్ని విల్లులా వంచుతారు. ఈ ఆసనం వలన వెన్ను, పొట్ట, కాళ్ళు, చేతులు బలోపేతం అవుతాయి. జీర్ణక్రియ మెరుగుపడుతుంది, ఒత్తిడి తగ్గుతుంది.

Image credits: pexels
Telugu

వజ్రాసనం (Vajrasana)

యోగాసనాల్లో వజ్రాసనం కూడా ఒకటి. తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడంలో ఈ ఆసనం ఎంతో చక్కగా పని చేస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరచడం, వత్తిడిని తగ్గించడం వంటి అనేక ప్రయోజనాలున్నాయి. 

Image credits: Social media
Telugu

శవాసనం (Shavasana)

దీనినే మృతభంగిమ అని కూడా అంటారు. ఇది యోగాలో విశ్రాంతి భంగిమ. ఈ ఆసనం ఒత్తిడి తగ్గిస్తుంది. శారీరక, మానసిక ప్రశాంతత అందిస్తుంది.

Image credits: freepik
Telugu

ప్రాణాయామం ( pranayama)

ప్రాణాయామం అంటే శ్వాసను నియంత్రించే ఒక యోగా పద్ధతి. దీని వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇది ఊపిరితిత్తులు, మెదడు ఆరోగ్యానికి చాలా మంచిది. 

Image credits: Getty
Telugu

త్రికోణాసనం (Trikonasana)

ఈ ఆసనంలో శరీరాన్ని త్రిభుజాకారంలో వంచుతారు. కాళ్ళు, తుంటి, వెన్ను, భుజాలు, చేతులను బలోపేతం చేయడానికి ఈ ఆసనం సహాయపడుతుంది. ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది. 

Image credits: Wikimedia Commons

Health Tips: విటమిన్ డి అధికంగా ఉండే ఆహార పదార్థాలు ఇవే..

Weight Loss Mistakes: ఈ తప్పులు చేస్తే అస్సలు బరువు తగ్గరు.. పైగా..

Pomegranate: రోజుకో దానిమ్మ పండు తింటే.. ఏం జరుగుతుందో తెలుసా ?

Kidney health: కిడ్నీలకు హాని కలిగించే చెడు అలవాట్లు ఇవే..