Yoga Mistakes: యోగా చేస్తున్నారా? ఈ తప్పులు అస్సలు చేయకండి!
health-life Jun 21 2025
Author: Rajesh K Image Credits:Freepik
Telugu
వార్మ్-అప్ మరువద్దు
యోగా చేసేటప్పుడు చాలామంది వార్మ్ అప్ చేయకుండానే నేరుగా ఆసనాలు చేస్తారు. వార్మ్-అప్ లేకుండా ఆసనాలు వేస్తే.. గాయాలు లేదా బెణికే అవకాశం ఉంది.
Image credits: Freepik
Telugu
శ్వాస విధానంలో మార్పులు
యోగాభ్యాసంలో శ్వాస తీసుకోవడం, వదలడం చాలా ముఖ్యం. కానీ చాలామంది శ్వాస ఆపుకుంటారు లేదా నెమ్మదిగా శ్వాస తీసుకుంటారు. శ్వాస విధానం సరిగా లేకపోతే.. తీవ్రమైన వ్యాధులు కూడా సంభవించవచ్చు.
Image credits: Freepik
Telugu
తిన్న తర్వాత
యోగా చేసే ముందు చాలామంది ఏదైనా తింటారు, ఇది చాలా పెద్ద తప్పు. తిన్న తర్వాత కనీసం 2-3 గంటల తర్వాత యోగా చేయాలి.
Image credits: Freepik
Telugu
గురువు మార్గదర్శకత్వంలో
యోగా ఎల్లప్పుడూ యోగా గురువు మార్గదర్శకత్వంలో లేదా అద్దంలో చూసుకుంటూ చేయాలి. చాలామంది ఆసనాలు తప్పుగా చేస్తారు. దీనివల్ల వెన్నునొప్పి, మెడనొప్పి వస్తుంది.
Image credits: Freepik
Telugu
దినచర్యలో భాగం
చాలా మంది వారానికి ఒకటి లేదా రెండు సార్లు యోగా చేస్తారు. యోగాను రోజువారీ దినచర్యలో భాగం చేసుకోవాలి. రోజూ కనీసం 20-30 నిమిషాలు యోగా చేయాలి.
Image credits: Freepik
Telugu
విశ్రాంతి తీసుకోకపోవడం
యోగా చేసిన తర్వాత కొంతసేపు విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం. ఇలా చేయడం వల్ల కండరాలు, కీళ్ళు రిలాక్స్ అవుతాయి. దీని వల్ల శక్తిని తిరిగి పొందవచ్చు. కండరాల నొప్పి తగ్గుతుంది.