Telugu

వయసు పెరిగినా అందంగా, యవ్వనంగా కనిపించాలా? ఇలా చేస్తే చాలు..

Telugu

సూర్య నమస్కారాలు

సాంప్రదాయ యోగాలో సూర్య నమస్కారాలకు ప్రత్యేక స్థానం ఉంది. ఇవి ఆరోగ్యంగా ఉండటమే కాకుండా శరీరక, మానసిక ఆరోగ్యంపై  ప్రభావం చూపుతాయి. చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. 

Image credits: Getty
Telugu

కార్డియో వర్కౌట్స్

పరుగెత్తడం, సైకిల్ తొక్కడం, జుంబా వంటి కార్డియో వర్కౌట్ క్రమంగా చేయడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగై, చర్మ కణాలకు తగినంత పోషకాలు, ఆక్సిజన్ అందుతాయి, ఫలితంగా చర్మం మెరిసిపోతుంది

Image credits: social media
Telugu

ప్రాణాయామం

ప్రాణాయామం, ధ్యానం చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ప్రాణాయామం, ధ్యానం ఒత్తిడిని తగ్గించి, రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి, ఫలితంగా చర్మం ఆరోగ్యంగా, యవ్వనంగా కనిపిస్తుంది.

Image credits: Getty
Telugu

స్ట్రెంగ్త్ ట్రైనింగ్

స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వల్ల కండరాలు దృఢంగా తయారవుతాయి, శరీరంలో కొవ్వు తగ్గుతుంది. ఎముకలు బలంగా ఉంటాయి. ఇవన్నీ మిమ్మల్ని ఆరోగ్యంగా, యవ్వనంగా కనిపించేలా చేస్తాయి.

Image credits: Getty
Telugu

ఫేస్ యోగా

ఫేస్ యోగా ముఖం మీద ముడతలు తగ్గించి, చర్మాన్ని బిగుతుగా, యవ్వనంగా కనిపించేలా చేయడంలో సహాయపడుతుంది. 

Image credits: Getty
Telugu

నడక

నడక అనేది సులభమైన, ప్రభావవంతమైన వ్యాయామం. ఇది శరీరాన్ని చురుగ్గా ఉంచడానికి, శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. రోజుకు 30 నిమిషాల నడకతో అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

Image credits: FreePik/ Pexels
Telugu

క్రమం తప్పకుండా చేయండి!

క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల యవ్వనంగా కనిపించడంతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వ్యాయామం ఒత్తిడిని తగ్గిస్తుంది, గుండె ఆరోగ్యాన్ని, మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.

Image credits: pexels

Sprouts: రోజూ మొలకెత్తిన విత్తనాలు తింటే.. ఇన్ని లాభాలా ?

Coconut Oil vs Olive Oil: జుట్టు ఒత్తుగా పెరగాలంటే ఏ నూనె మంచిది?

Liver Damage : కాలేయాన్ని దెబ్బతీసే చెడు అలవాట్లు.. వెంటేనే ఆపేయండి

Gut Health: ఈ లక్షణాలు ఉంటే.. పేగు ఆరోగ్యం ప్రమాదంలో పడ్డట్టే..