Health
సబ్జా వాటర్ మన గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి బాగా సహాయపడుతుంది. ఈ గింజల్లో ఉండే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు మన గుండెను, మెదడును ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి.
సబ్జా వాటర్ లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది మన జీర్ణక్రియను మెరుగుపరిచి మలబద్దకం, గ్యాస్ వంటి జీర్ణసమస్యలను తగ్గిస్తుంది.
సబ్జా వాటర్ డయాబెటీస్ పేషెంట్లకు మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ నీళ్లను తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.
సబ్జా గిజంల్లో కాల్షియం, ఫాస్ఫరస్ లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ ఎముకలను బలంగా, ఆరోగ్యంగా ఉంచుతాయి.
సబ్జా నీళ్లు బరువు తగ్గడానికి కూడా బాగా ఉపయోగపడతాయి. వీటిని తాగితే మన ఆకలి చాలా వరకు తగ్గి ఆరోగ్యంగా బరువు తగ్గుతారు.
సబ్జా వాటర్ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి కూడా సహాయపడతాయి. ఈ వాటర్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మ సమస్యలను తగ్గించి చర్మ ఆరోగ్యానికి సహాయపడతాయి.
ఏదేమైనా మన ఆహారపు అలవాట్లను మార్చుకునే ముందు ఆరోగ్య నిపుణుల సలహా తీసుకోవడం చాలా మంచిది.