Health

ఇలా చేస్తే కిడ్నీ స్టోన్ నొప్పి వెంటనే తగ్గుతుంది

కిడ్నీ స్టోన్ నొప్పి

కిడ్నీలో రాళ్ల వల్ల తట్టుకోలేని నొప్పి వస్తుంది. దీనివల్ల చాలా మంది అస్వస్థతకు కూడా గురవుతుంటారు. అయితే ఈ నొప్పిని తగ్గించడంలో కొన్ని డ్రింక్స్ చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. 

నీళ్లు ఎక్కువ తాగాలి

కిడ్నీ స్టోన్స్ ఉంటే మీరు నీళ్లను ఎక్కువగా తాగాలి. అలాగేటీ, కాఫీలు అసలే తాగకూడదు. నీళ్లు మూత్రాన్ని పలుచగా చేసి స్టోన్స్ బయటకు పోయేలా చేస్తుంది. అలాగే నొప్పిని తగ్గిస్తుంది. 

ఆపిల్ సైడర్ వెనిగర్

ఆపిల్ సైడర్ వెనిగర్‌ కిడ్నీ రాళ్లను చిన్నగా చేయడానికి సహాయపడుతుంది. ఇది నొప్పిని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. 

అజ్వైన్ ఆకుల రసం

అజ్వైన్ వాటర్ లో యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం మెండుగా ఉంటాయి. ఇవి కిడ్నీల్లో రాళ్లు ఏర్పడకుండా చూస్తాయి. ఇది కిడ్నీ స్టోన్ పెయిన్ ను తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. 

తులసి వాటర్

తులసి ఆకులను పేస్ట్ గా చేసి అందులో కొన్ని నీళ్లు కలిపి రసం  చేయండి. దీనిలో ఉండే ఆమ్ల గుణం కిడ్నీ రాళ్లను చిన్నచిన్నగా వడగొట్టి బయటకు పోయేలా చేస్తుంది.నొప్పిని కూడా తగ్గిస్తుంది. 

నిమ్మరసం

నిమ్మరసం కూడా కిడ్నీ స్టోన్స్ ను తగ్గించడానికి బాగా సహాయపడుతుంది. నిమ్మరసంలో ఉండే ఆమ్ల గుణాలుపెద్ద కిడ్నీ స్టోన్స్ ను చిన్న ముక్కలుగా చేసి బయటకు పంపుతుంది.

Find Next One