రోజూ ఒక అరటిపండు తింటే బరువు తగ్గడమే కాదు.. ఈ లాభాలూ ఉన్నయ్
health-life Oct 21 2024
Author: Shivaleela Rajamoni Image Credits:Getty
Telugu
అధిక రక్తపోటు
అరటి బీపీని కంట్రోల్ చేయడానికి కూడా సహాయపడుతుంది. ఈ పండులో ఉండే పొటాషియం అధిక రక్తపోటును నియంత్రించడానికి, గుండె ఆరోగ్యాన్ని కాపాడటానికి సహాయపడుతుంది.
Image credits: Getty
Telugu
జీర్ణక్రియ
అరటిలో పుష్కలంగా ఉండే ఫైబర్ కంటెంట్ జీర్ణ సమస్యలను తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. దీన్ని తింటే కడుపు సమస్యలు, మలబద్ధకం వంటి సమస్యలు తగ్గిపోతాయి.
Image credits: Getty
Telugu
శక్తి
అరటిపండు మన శరీరానికి కావాల్సిన తక్షణ శక్తిని అందిస్తుంది. మీరు రోజూ ఒక అరటిపండును తింటే మీ శరీరానికి అవసరమైన శక్తి అందుతుంది.
Image credits: Getty
Telugu
కొలెస్ట్రాల్
అరటిపండు ఒంట్లో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను కరిగించడానికి కూడా సహాయపడుతుంది. దీనిలో పెక్టిన్ అనే నీటిలో కరిగే ఫైబర్ చెడు కొలెస్ట్రాల్ అయిన ఎల్‌డిఎల్ ను తగ్గించడానికి సహాయపడుతుంది.
Image credits: Getty
Telugu
మానసిక ఆరోగ్యం
మీరు రోజూ ఒక అరటిపండును గనుక తిన్నారంటే మీ మానసిక ఆరోగ్యానికి ఏ డోకా ఉండదు. ఇది ఒత్తిడి, యాంగ్జైటీ, డిప్రెషన్ వంటి వాటిని తగ్గిస్తుంది.
Image credits: Getty
Telugu
ఊబకాయం
అరటిపండ్లలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది మీ ఆకలిని తగ్గించి మీరు బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
Image credits: Getty
Telugu
చర్మం
అరటిపండులో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. ఇవి మీ చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంచుతాయి.