Health
జీలకర్ర నీటిలో డైజెస్టివ్ ఎంజమైమ్స్ ఉంటాయి. ఇవి కడుపుబ్బరం, అసిడిటీ వంటి సమస్యలను తగ్గించడంలో ఉపయోగపడుతుంది.
ఖాళీ కడపుతో జీరా వాటర్ తాగితే మెటబాలిజం పెరుగుతుంది. అదే విధంగా ఇందులోని ఫైబర్ కంటెంట్ కడుపు నిండిన భావనను కలిగిస్తుంది.
జీరా వాటర్‌లో ఉండే పొటాషియం, మెగ్నీషియం వంటి ఎలక్ట్రోలైట్స్ శరీరాన్ని డీహైడ్రేషన్‌కు గురి కాకుండా చూడడంలో ఉపయోగపడుతుంది.
జీలకర్ర నీటిని తీసుకుంటే షుగర్ లెవల్స్ కంట్రోల్‌లో ఉంటుంది. డయాబెటిస్ పేషెంట్స్‌కి ఇది ఎంతో మేలు చేస్తుంది.
ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ చర్మాన్ని కాపాడుతాయి. అదే విధంగా ఇన్‌ప్లమేషన్‌ను తగ్గించడంతో చర్మం మెరుస్తుంది.
జీలకర్రలో విటమిన్ సి, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలే పాటించాలి.