Telugu

భోజనం చేసిన తర్వాత ఒకటిరెండు లవంగాలను నమిలితే ఏమౌతుందో తెలుసా

Telugu

రోగనిరోధక శక్తి పెరుగుతుంది

లవంగాల్లో యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. వీటిని భోజనం చేసిన తర్వాత నమిలితే మీ ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. అలాగే దగ్గు, జలుబు వంటి సమస్యలు రావు. 

Image credits: Getty
Telugu

రక్తంలో చక్కెర నియంత్రణ

లవంగాలు డయాబెటీస్ పేషెంట్లకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. షుగర్ ఉన్నవారు వీటిని ఉదయాన్నే నమిలితే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.

Image credits: Getty
Telugu

గ్యాస్ తగ్గుతుంది

లవంగాల్లో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి వీటిని తిన్న వెంటనే నమిలితే గ్యాస్ సమస్య, కడుపు ఉబ్బరం వెంటనే తగ్గిపోతాయి. 

Image credits: Getty
Telugu

ఎసిడిటీ

చాలా మందికి తిన్న వెంటనే ఎసిడిటీ అటాక్ చేస్తుంది. ఇలాంటి వారు భోజనం చేసిన తర్వాత లవంగాలను నమిలితే ఎసిడిటీ తగ్గుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

Image credits: Getty
Telugu

పంటి నొప్పి తగ్గుతుంది

ఆరోగ్య నిపుణుల ప్రకారం.. లవంగాలు మన నోటి ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిని నమిలితే పంటి నొప్పి తొందరగా తగ్గిపోతుంది. 

Image credits: Getty
Telugu

నోటి దుర్వాసన

 నోటి దుర్వాసనను తగ్గించడానికి లవంగాలు చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. ఇందుకోసం లవంగం నూనెను గోరువెచ్చని నీళ్లలో కలిపి తిన్న తర్వాత పుక్కిలించాలి.

Image credits: Getty
Telugu

సూచన

ఏదేమైనా ఆరోగ్య నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే మీ ఆహారంలో మార్పులు చేయాలి. 

Image credits: Getty

రోజూ మెంతులు తింటే ఇన్ని ప్రయోజనాలా? అస్సలు నమ్మలేరు!

కడుపు ఉబ్బరానికి.. మీరు చేసే ఈ తప్పులే కారణం

నానబెట్టిన కిస్ మిస్ లను తింటే మీ శరీరంలో ఈ తేడాను గమనిస్తారు

రోజూ గుప్పెడు సన్ ఫ్లవర్ గింజలు తింటే ఏమవుతుందో తెలుసా?