Telugu

గ్లకోమా.. ఈ లక్షణాలు అస్సలు లైట్ తీసుకోవద్దు

ప్రపంచవ్యాప్తంగా 8 కోట్ల మంది పైగా గ్లకోమాతో బాధపడుతున్నారు. మన దేశంలో దాదాపు 90 శాతం మందికి ఈ వ్యాధి నిర్ధారణే కావడం లేదంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

Telugu

అసలు గ్లకోమా అంటే?

గ్లకోమా అనేది ఒక రకమైన కంటి జబ్బు. ఇది కళ్లను మెదడుకు కనెక్ట్ చేసే ఆప్టిక్ నరాలను నెమ్మదిగా దెబ్బతీస్తుంది.

Image credits: Getty
Telugu

ఎవరికి రిస్క్ ఎక్కువ?

60 ఏళ్లు పైబడిన వారికి, షుగర్ ఉన్నవాళ్లకు, హై బీపీతో బాధపడేవారికి గ్లకోమా వచ్చే ప్రమాదం ఎక్కువ. కుటుంబంలో ఎవరికైనా గ్లకోమా ఉన్నా రిస్క్ ఉన్నట్టే.

Image credits: Getty
Telugu

లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, సరైన సమయంలో స్పందిస్తే దాదాపు 80 శాతం కంటిచూపు సమస్యలను నివారించవచ్చు లేదా నయం చేయవచ్చు.

Image credits: Getty
Telugu

ఏ వయసులోనైనా రావచ్చు

వయసు పెరగడం ఒక ముఖ్య కారణమే అయినా.. చిన్నతనం, కౌమారదశ, యవ్వనంలోనూ సహా జీవితంలో ఏ దశలోనైనా గ్లకోమా రావచ్చు.

Image credits: our own
Telugu

ముందుగా గుర్తిస్తేనే మేలు

సరైన చికిత్స తీసుకుంటే వ్యాధిని అదుపులో ఉంచవచ్చు. అందుకే వ్యాధిని ముందుగానే గుర్తించడం చాలా ముఖ్యం. అప్పుడే చూపు పూర్తిగా పోకుండా కాపాడుకోవచ్చు.

Image credits: our own
Telugu

ఇవి ముఖ్యమైన లక్షణాలు

చూపు మసకబారడం, తీవ్రమైన తలనొప్పి, కళ్లలో విపరీతమైన నొప్పి, వికారం లేదా వాంతులు వంటివి గ్లకోమా ప్రధాన లక్షణాలు.

Image credits: Getty
Telugu

మరికొన్ని లక్షణాలు ఇవే..

లైట్ల వైపు చూసినప్పుడు వాటి చుట్టూ ఇంద్రధనస్సులా వలయాలు కనిపించడం, కళ్లు ఎర్రబడటం వంటి లక్షణాలపై కూడా ఓ కన్నేసి ఉంచాలి.

Image credits: Getty

Jamun Seeds: ఈ గింజలతో షుగర్‌కు చెక్.. బీపీ కూడా కంట్రోల్!

Gut Health: పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే అలవాట్లు ఇవే! ఫాలో అవుతున్నారా మరి!..

Oral Health: ఆరోగ్యమైన పళ్లు, చిగుళ్ల కోసం ఈ 7 విషయాలు తప్పక పాటించండి

Black Coffee: మీ డే బ్లాక్ కాఫీతో మొదలవుతుందా? అయితే ఈ విషయం మీకు తెలుసా?