Telugu

ఈ పండ్లు తింటే షుగర్ పెరుగుతుంది

Telugu

మామిడి పండ్లు

మామిడి పండ్లు తీయగా, టేస్టీగా ఉంటాయి. అయితే ఒక మీడియం సైజు మామిడి పండులో 46 గ్రాముల షుగర్ ఉంటుంది. ఈ పండ్లను తింటే షుగర్ బాగా పెరుగుతుంది. అందుకే మధుమేహులు ఈ పండ్లను తినకూడదు
 

Image credits: Getty
Telugu

దానిమ్మ పండు

దానిమ్మ పండులో కూడా నేచురల్ షుగర్స్ ఎక్కువగా ఉంటుంది. ఒక దానిమ్మ పండులో 24 గ్రాముల షుగర్ ఉంటుంది కాబట్టి దీన్ని తక్కువగా తినాలంటారు డాక్టర్లు. 
 

Image credits: Getty
Telugu

ద్రాక్షపండ్లు

ద్రాక్షపండ్లు ఆరోగ్యానికి మంచివే అయినా డయాబెటీస్ పేషెంట్లు మాత్రం దీన్ని ఎక్కువగా తినకూడదు. ఎందుకంటే కప్పు ద్రాక్షల్లో 23 గ్రాముల షుగర్ ఉంటుంది. ఈ పండ్లు బ్లడ్ షుగర్ ను పెంచుతాయి. 

Image credits: Getty
Telugu

చెర్రీలు

కప్పు చెర్రీ పండ్లలో 18 గ్రాముల నేచురల్ షుగర్ ఉంటుంది. కాబట్టి వీటిని ఎక్కువగా తింటే కూడా రక్తంలో చక్కెర స్థాయిలు బాగా పెరుగుతాయి. 

Image credits: Getty
Telugu

అరటి పండు

అరటిపండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. ఒక మీడియం సైజు అరటిలో 14 గ్రాముల షుగర్ ఉంటుంది. బాగా పండిన అరటిపండులో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. వీటిని తింటే షుగర్ పెరుగుతుంది. 

Image credits: Getty
Telugu

పైనాపిల్

పైనాపిల్ లో కూడా షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. కప్పు పైనాపిల్‌లో 16 గ్రాముల షుగర్ ఉంటుంది. ఈ పండ్లు కూడా మీ బ్లడ్ షుగర్ ను పెంచుతాయి.

Image credits: Getty
Telugu

పుచ్చకాయ

పుచ్చకాయ మంచిదే అయినా దీనిలో నేచురల్ షుగర్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిని ఎక్కువగా తింటే కూడా డయాబెటీస్ పేషెంట్ల రక్తంలో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. 

Image credits: Getty

చలికాలంలో తప్పకుండా తినాల్సిన పండ్లు ఇవి

పరిగడుపున అల్లం నీళ్లు తాగితే ఏమౌతుందో తెలుసా

చియా సీడ్ వాటర్ లో కుంకుమ పువ్వు కలిపి తాగితే ఏమౌతుందో తెలుసా

వీళ్లు కాఫీ అస్సలు తాగొద్దు