Health

వీళ్లు కాఫీ అస్సలు తాగొద్దు

Image credits: Espresso vs other coffee types

GERD సమస్య

గుండెల్లో మంట, యాసిడ్ రిఫ్లెక్స్ సమస్యతో బాధపడేవారు మాత్రం కాఫీని అస్సలు తాగకూడదు. ఎందుకంటే కాఫీని తాగితే గుండెల్లో మంట, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు ఎక్కువ అవుతాయి. 

Image credits: Getty

నిద్రలేమి

నిద్రలేమి, ఆందోళన సమస్యలుంటే కూడా కాఫీని తాగడం మానుకోవాలి. ఎందుకంటే కాఫీ గుండెల్లో దడను పెంచుతుంది. అసౌకర్యాన్ని కలిగిస్తుంది. 

Image credits: social media

ఐరన్ లోపం

ఐరన్ లోపం ఉన్నవారు కూడా కాఫీని తాగకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాఫీ మీ శరీరంలో ఐరన్ లోపాన్ని మరింత పెంచుతుంది. 

Image credits: social media

గర్భిణులు

ప్రెగ్నెన్సీ టైంలో కాఫీని ఎక్కువ తాగితే నెలలు నిండకుండానే డెలివరీ అయ్యే అవకాశం ఉంది. అలాగే బిడ్డ తక్కువగా బరువుతో పుట్టే ఛాన్స్ ఉంది.అంతేకాదు గర్భస్రావం వంటి సమస్యలనూ కలిగిస్తుంది. 

Image credits: social media

రక్తపోటు

హైబీపీ పేషెంట్లు కాఫీని తాగకుండా ఉండటమే మేలు. ఎందుకంటే కాఫీని తాగితే గుండె, రక్తనాళాలపై ఒత్తిడి బాగా పెరుగుతుంది. 

Image credits: Instagram

మూత్రం అపుకుంటే ఏం జరుగుతుందో తెలుసా?

ఉదయాన్నే వేడి నీళ్లు తాగితే ఏమౌతుందో తెలుసా

క్యారెట్ తింటే ఏమౌతుందో తెలుసా

ఈ చిన్న చిన్న ఆకులు తింటే మీకు ఎలాంటి జబ్బులు రావు